ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు.. 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి

  • IndiaGlitz, [Thursday,July 29 2021]

అసలే కరోనా విపత్తుతో థియేటర్లు పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు ఏపీలో టికెట్ ధరలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది థియేటర్ల పరిస్థితి. ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఏపీలో సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోనున్నాయి.

జూలై 31నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అది కేవలం 50 శాతం అక్యుపెన్సీతోనే. శానిటైజర్స్, మాస్కులు, భౌతిక దూరంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.

థియేటర్ల రీ ఓపెన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 13 జిల్లాలోని థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు అత్యవసర సమావేశం అయ్యారు. 50 శాతం సీటింగ్ తో థియేటర్లు నడిపితే తమకు నష్టం అని అంటున్నారు.ఈ మేరకు తమని ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

థియేటర్ యజమానులు సమావేశంలో టికెట్ ధరలు, కోవిడ్ విషయంలో తెసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం జూలై 8 నుంచే థియేటర్లు తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. కానీ ఆ సమయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదంతో అప్పుడు థియేటర్లు ఓపెన్ కాలేదు. కాగా ఏపీ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్ కు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శుక్రవారం తిమ్మరుసు, ఇష్క్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

More News

రాంచరణ్ రూ.25 లక్షలు గెలుచుకున్నాడా.. కేవలం రెండడుగుల దూరంలో

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రూ 25 లక్షలు గెలుచుకున్నాడు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అధునాతన హంగులతో ప్రసాద్'స్ మల్టీప్లెక్స్

ప్రసాద్'స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటు.

సాలిడ్ టీఆర్పీ నమోదు చేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఈ ఏడాది విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

RRR: నా మైండ్ లోనుంచి పోవట్లేదు.. 'దోస్తీ' సాంగ్ పై హేమచంద్ర

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్.

హాట్ ఫోటోస్: బ్రాలో పరువాల హొయలు.. సారా స్టన్నింగ్ ఫోజులు

బాలీవుడ్ లో ఫ్యూచర్ జనరేషన్ స్టార్ హీరోయిన్ పరిగణింపబడుతోంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా..