close
Choose your channels

Bellamkonda Suresh:నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ : అద్దాలు పగులగొట్టి .. కాస్ట్‌లీ లిక్కర్ ‌బాటిల్స్‌తో పరార్

Saturday, June 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. దొంగలు కూడా తాము దొంగతనం చేయడానికి ఏదైనా ఓకే అంటున్నారు. మనం డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను కొట్టేసే దొంగలను చూసుంటాం. కానీ మందు బాటిళ్లను కొట్టేసి దొంగల గురించి కనీసం విన్నామా. కానీ ఇది నిజంగా జరిగింది.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేషే బాధితుడు. వినడానికి విడ్డూరంగా వుంది కాదూ.

పొద్దున్నే చూసే సరికి కారు అద్దాలు ధ్వంసం:

వివరాల్లకి వెళితే.. బెల్లంకొండ సురేష్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో నివసిస్తున్నారు. ఎప్పటిలాగే తన ఇంటి ముందే తన బెంజ్ కారును పార్క్ చేశారు. అయితే ఉదయం నిద్ర లేచి చూసే సరికి కారు అద్దాలు ధ్వంసమై వున్నాయి. అంతేకాదు.. కారులోని రూ.50 వేల నగదుతో పాటు విలువైన 11 రాయల్ సెల్యూట్ మద్యం బాటిళ్లు (ఒక్కో దాని ధర రూ.28 వేలు)ను దుండగులు అపహరించుకుపోయారు. డిక్కీ పగులగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయన వెంటనే 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కారు డిక్కీలో ఖరీదైన మద్యం బాటిళ్లు ఉన్న సంగతి తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇకపోతే.. బెల్లంకొండ సురేష్‌ టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతల్లో ఒకరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ తదితర హీరోలతో ఆయన సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం తన వారసులు శ్రీనివాస్, గణేష్‌లను హీరోలుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.