వారి నటన నన్నెంతగానో ఆకట్టుకుంది: రామ్‌చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Monday,August 10 2020]

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియావ‌ర్క్స్‌, మ‌హాయాణ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కులను ఈ చిత్రం ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ చిత్ర యూనిట్‌కు ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య నా మ‌న‌సుకెంతో నచ్చింది. అద్భుత‌మైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌గారు, సుహాస్‌, హ‌రి చంద‌న‌, రూప త‌దిత‌రుల న‌ట‌న న‌న్నెంత‌గానో ఆక‌ట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’ అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. మ‌ల‌యాళంలో ఫహాద్ ఫాజిల్ నటించిన చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్’కు ఇది రీమేక్.

More News

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.

సూపర్ ఫైన్‌గా ఉన్నా.. డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ: వర్మ

తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకు వర్మ డంబెల్స్‌తో సిద్ధమై పోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో చేశారు.

సరదాగా అమ్మ కోసం.. తిడుతుందో.. బ్రహ్మాండం అంటుందో.. : చిరు

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేపల వేపుడు చేశారు.

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు.