అప్పుడు అంజలి..ఇప్పుడు తాప్సీ..

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

హాస్య‌న‌టుడుగా త‌నదైన ముద్ర వేసిన శ్రీ‌నివాస‌రెడ్డి.. అప్పుడ‌ప్పుడు క‌థానాయ‌కుడు స్థాయి పాత్ర‌ల్లో ప‌ల‌క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన 'గీతాంజ‌లి'లో శ్రీ‌నివాస‌రెడ్డి పోషించిన పాత్ర‌ క‌థకి కీల‌కం. ఇక గ‌తేడాది 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా'తో క‌థానాయ‌కుడుగా ప‌ల‌క‌రించి.. ఫ‌ర‌వాలేద‌నిపించాడు. ఇప్పుడు మ‌ళ్లీ 'ఆనందోబ్ర‌హ్మ‌'లో మ‌రోసారి ముఖ్య భూమిక పోషించాడు. ఈ చిత్రం రేపు విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. శ్రీ‌నివాస‌రెడ్డి ముఖ్య పాత్ర‌లో న‌టించిన 'గీతాంజ‌లి' ఏ ఆగ‌స్టు నెల‌లో విడుద‌లైందో.. అదే నెల‌లో 'ఆనందోబ్ర‌హ్మ' కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.

'గీతాంజ‌లి' చిత్రంలో అంజ‌లి లాంటి టాప్ హీరోయిన్తో క‌లిసి న‌టించి త‌న ఖాతాలో ఓ హిట్ వేసుకున్న శ్రీ‌నివాస రెడ్డి.. ఈ సారి 'ఆనందోబ్ర‌హ్మ‌'లో తాప్సీ లాంటి మ‌రో స్టార్ హీరోయిన్‌తో క‌లిసి సంద‌డి చేస్తున్న వైనం ఆగ‌స్టు నెల సాక్షిగా క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆల్ ది బెస్ట్ శ్రీ‌నివాస‌రెడ్డి!

More News

గతేడాది తారక్.. వచ్చే ఏడాది పవన్..

ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు..ఇలా ఒక తరంలోని అగ్ర కథానాయకులంతా 200,

అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే..

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా..వినడానికి బాగుంటాయి.ఫర్ ఎగ్జాంపుల్ యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ నే తీసుకుంటే..

మహేష్ బాలీవుడ్ ఎంట్రీ...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం'స్పైడర్'.

చిరు చిత్రంలో తమిళనటుడు...

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరగుతున్నాయి.

సీక్వెల్ ప్లాన్ లో ధనుష్...

ధనుష్ సినిమాలకు తమిళంతో పాటు తెలుగు,హిందీల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.