నా డెస్టెనీ వేరేలా ఉందని అప్పుడు తెలిసింది: రేణు దేశాయ్

  • IndiaGlitz, [Wednesday,September 09 2020]

1995లో ఇదే రోజున తాను కెమెరాను ఫేస్ చేశానని ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ వెల్లడించారు. అసలు తాను ఎంచుకున్న ప్రొఫెషన్ ఒకటని కానీ అయ్యింది ఒకటని ఇన్‌స్టా వేదికగా రేణు చెప్పుకొచ్చారు. తాను 16 ఏళ్ల వయసులో ఊహించని పరిణామాల మధ్య కెమెరాను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. తానొక అంతరిక్ష శాస్త్రవేత్తను కావాలని భావించానని కానీ ఆ కోరికను వదులుకోవడానికి తాను చాలా బాధపడ్డానని వెల్లడించారు. ఇది తనను కొన్నేళ్లపాటు బాధించిందని ఇన్‌స్టాలో రేణు దేశాయ్ వెల్లడించారు.

‘‘9 సెప్టెంబర్, 1995. నేను మొదటిసారి కెమెరాను ఫేస్ చేసి నేటికి 25 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుండి అంతరిక్ష శాస్త్రవేత్తనో లేదంటే న్యూరో సర్జన్‌నో కావాలనుకున్నా. నా మార్క్ షీట్లు నా కోరికలకు సపోర్ట్ ఇచ్చాయి. కానీ నా డెస్టినీ వేరే విధంగా ఉందని.. 16 ఏళ్ల వయసులో నేను కెమెరాను ఫేస్ చేసేంత వరకూ తెలియలేదు. ఫిల్మ్ మేకింగ్‌తో ప్రేమలో పడ్డాను. మిగిలిన చరిత్రంతా మీకు తెలిసిందే. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని.. నాసాలో చేరాలనే నా కలను వీడటం 16 ఏళ్ళ వయస్సులో నాది చాలా బాధాకరమైన నిర్ణయం.

కొన్నేళ్ల పాటు ఈ విషయంలో బాధ పడ్డాను. కానీ సినిమా తీయడం పట్ల నాకున్న ప్రేమ.. భౌతిక శాస్త్రం, గణితంపై నాకున్న ప్రేమను మరిపించింది. దర్శకురాలిగా నేను ఇప్పటికీ ‘స్టార్స్’తో వ్యవహరించాల్సి ఉంటుంది. మీ హార్ట్ ఎలా చెబితే అలా నడుచుకోండి. సిన్సియర్‌గా.. కష్టపడి పని చేస్తే సక్సెస్‌తో పాటు ఆనందం మీ సొంతమవుతుంది’’ అని రేణు తెలిపారు. అయితే రేణు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ తన మొట్టమొదటి ఫోటో షూట్ సందర్భంగా జగన్ తీశారని.. ఆ సమయంలో ఫోటో షాప్ కానీ ఫ్యాన్సీ పరికరాలు కానీ లేవని రేణు తెలిపారు.

More News

'బొమ్మ బ్లాక్ బస్టర్' చిత్రం నుండి రష్మీ ఫస్ట్ లుక్

యంగ్ టాలెంటెడ్ హీరో నందు, డ‌స్కీ బ్యూటీ ర‌ష్మీ గౌత‌మ్ జంట‌గా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై

నిలిచిపోయిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు..

ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్ అర్థంతరంగా ఆగిపోయాయి.

కీసర తహసీల్దార్‌ను మించిన అవినీతి తిమింగళం దొరికింది..

25 రోజుల తేడాతోనే రెండు భారీ అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి.

క్లారిటీ లేని టాస్క్‌లతో బోర్ కొట్టించిన బిగ్‌బాస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అవడంతో... ఇంకేముంది ఇవాళ బిగ్‌బాస్ ఫుల్లు ఎంటర్‌టైనింగ్‌‌గా ఉండొచ్చు అనిపించింది.

అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి - అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్

యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.