close
Choose your channels

అక్క‌డ బాల‌న‌టి.. ఇక్క‌డ హీరోయిన్‌

Wednesday, November 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్క‌డ బాల‌న‌టి.. ఇక్క‌డ హీరోయిన్‌

కోలీవుడ్‌లో బాల‌న‌టిగా సినిమాలు చేసిన ఓ అమ్మాయి.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఆమె ఎవ‌రో కాదు... అనిఖ సురేంద్ర‌. ఈమె మ‌ల‌యాళీ. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా చేసిన ‘ఎంత‌వాడుగానీ(ఎన్నైఅరిందాల్‌), విశ్వాసం’ చిత్రాల్లో అనిఖ కూతురు పాత్రలో న‌టించింది. ఈమె ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘క‌ప్పేళ‌’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని తీసుకుంటే బావుంటుంద‌ని నిర్మాతలు భావించారు. అందులో కోసం ఉప్పెన ఫేమ్ క్రితిశెట్టిని ముందుగా సంప్ర‌దించార‌ట‌.

అయితే ఆమె ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడ‌గ‌టంతో మ‌రో హీరోయిన్‌ను అన్వేషించారు. అందులో భాగంగానే అనిఖ సురేంద్ర అయితే సెట్ అవుతుంద‌ని వారు భావించార‌ట‌. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో విశ్వ‌క్‌సేన్‌, న‌వీన్ చంద్ర న‌టిస్తున్నార‌ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందనుంది. యుక్త వయసులోని అమ్మాయిలు నమ్మే వ్యక్తులు ఎలా ఉంటారు?.. అనే పాయింట్ మీద ‘కప్పేళ’ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడు ఎవరనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. మలయాళ దర్శకుడినే తీసుకొస్తారా? లేక తెలుగు దర్శకుడే ఈ సినిమాను తెరకెక్కిస్తాడా? అని తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.