టాలీవుడ్‌కు కమెడియన్ల కొరత.. !

  • IndiaGlitz, [Wednesday,September 30 2020]

టాలీవుడ్‌లో కమెడియన్ల కొరత చాలా ఉంది. బ్రహ్మీ స్లో అయ్యాక మేకర్స్‌కు ఈ సమస్య ఎదురవుతోంది. ఏజ్ పెరిగాక బ్రహ్మీ సినిమాలను తగ్గించుకోవడం ఒక కారణమైతే.. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే బ్రహ్మీని అంత ఇచ్చుకోలేక కొందరు నిర్మాతలు వెనక్కు తగ్గుతున్నారు. ఏది ఏమైతేనేమీ.. ఇటీవలి కాలంలో బ్రహ్మీ ఏదో గెస్ట్ రోల్‌లో అది కూడా ఒకటి అర సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీకి కమెడియన్ల కొరత అయితే ఏర్పడిందనే చెప్పాలి.

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల్లో పెదవుల్లో చిరునవ్వు వెల్లివిరుస్తుంది. రొటీన్ కామెడీ అయినా.. హావభావాల్లో మార్పు లేకున్నా కూడా బ్రహ్మీని చూస్తే చాలు అలవోకగా నవ్వొచ్చేస్తుంది. బ్రహ్మీ కోసమే సినిమాలకు వెళ్లేవాళ్లూ ఉన్నారు. ఆయన ప్రేక్షకుల నాడి తెలిసిన కమెడియన్. చాలా సినిమాలు ఆయన ఉండటం వల్లనే హిట్ అయ్యాయనడంలో సందేహం లేదు. అలాంటి బ్రహ్మి ఇటీవలి కాలంలో స్లో అయ్యారు. ఆరోగ్య సమస్యలు ఒకవైపు.. భారీ రెమ్యునరేషన్ మరోవైపు ఒకరకంగా బ్రహ్మీని ఇండస్ట్రీకి దూరం చేశాయనే చెప్పాలి.

ఇక తెరపై హాస్యాన్ని పండించడంలో బ్రహ్మీని ఎవరూ బీట్ చేయలేరు అనుకుంటున్న తరుణంలో పృధ్వీ వచ్చి ఆ కొరతను కొంతమేర తీర్చగలిగారు.. కానీ ఆయన తన చేజేతులా కెరియర్‌ని నాశనం చేసుకున్నారు. కమెడియన్‌గా ఒక మంచి స్థానానికి వెళుతున్న సమయంలో రాజకీయ ఆరంగేట్రం.. ఆ తరువాతి పరిణామాలు మనకు తెలియనివి కావు. మంచి కమెడియన్‌గా రాణించిన సునీల్.. మరికొంత కాలం కమెడియన్‌గానే ఉండి ఉంటే బ్రహ్మీని బీట్ చేశావాడేమో కానీ హీరో అయ్యాక ఆయన కమెడియన్‌గా చేయలేనని తేల్చి చెప్పడంతో ఆయన కెరీర్‌పై ఆయనే నిప్పులు పోసుకున్నట్టు అయ్యింది. సునీల్ తిరిగి కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మునుపటిలా అయితే రాణించలేకపోతున్నాడు.

వెన్నెల కిషోర్‌కి మంచి కమెడియన్‌గా పేరున్నప్పటికీ అందర్నీ మేనేజ్ చేయలేకపోతున్నాడని తెలుస్తోంది. మరోవైపు ఆయన టాలెంట్‌ను ఇండస్ట్రీ కూడా పెద్దగా వాడుకోలేక పోతోంది. ఇక ఇప్పుడు వస్తున్న కుర్రాళ్లంతా వెండితెరపై ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. తాగుబోతు రమేష్ మూసలో పడిపోయాడని విమర్శలు వస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి సైతం కామెడీని పండించడంలో విఫలమవుతున్నాడు. ప్రవీణ్, సత్యలు మెరుపులు మెరిపించలేకపోతున్నారు. ప్రస్తుతం అద్భుతంగా రాణించగలిగే కమెడియన్లు లేక జబర్దస్త్ నటులను తీసుకుని హడావుడి చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం కూడా అట్టర్ ఫ్లాప్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి మంచి కమెడియన్ కావాల్సి ఉంది. మరి మున్ముందు అయినా బ్రహ్మీ లాంటి కమెడియన్ ఇండస్ట్రీకి దొరుకుతాడో లేదో వేచి చూడాలి.

More News

పెళ్లి పీటలెక్కబోతున్న యాంకర్ ప్రదీప్.. రాజకీయ నేత కూతురితో ఫిక్స్!

బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ ప్రదీప్. చాలా మంది మేల్ యాంకర్లు ఉన్నప్పటికీ స్పాంటేనియస్‌గా మాట్లాడుతూ..

ఆ మాటలను నేను ఒప్పుకోను : అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క.

ఆరని.. ‘రోబో-మనుషులు’ మంటలు..

ఇవాళ బిగ్‌బాస్‌లో చెప్పుకోదగిన విషయాలేమీ పెద్దగా లేవు. ఒక్క గేమ్‌తో నడిపించారు. ఆ గేమ్‌ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు.

రకుల్ విషయంలో మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి: ఢిల్లీ హైకోర్టు

డ్రగ్స్ కేసులో మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా పలు కథనాలను వెలువరిస్తూ తనను మానసికంగా వేధిస్తోందని..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన నేడు పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.