ఎన్టీఆర్ 30పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం!

  • IndiaGlitz, [Thursday,March 05 2020]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముగియ‌గానే, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా క‌థ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. వివ‌రాల మేర‌కు చిరంజీవి హీరోగా న‌టించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాను పోలిన కథతోనే ఎన్టీఆర్ 30 రూపొంద‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలంటూ నిర్మాణ సంస్థ‌కు సన్నిహిత వ‌ర్గాలు కొట్టి ప‌డేస్తున్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు), నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటూనే, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను పూర్తి చేస్తున్నారు. వేస‌వి పూర్తి కాగానే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

రాజ్యసభకు చిరు.. క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు!

మెగాస్టార్ చిరంజీవికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపరాఫర్ ఇవ్వాలని భావిస్తు్న్నాడని..

ఫలిస్తున్న జగన్ ప్రయత్నాలు.. కడపకు భారీ ప్రాజెక్ట్!

ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు గత ప్రభుత్వం దెబ్బిపొడుస్తుంటే..

30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలంటే.. : తమ్మారెడ్డి ట్రిక్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నయ్యకు సుజిత్.. తమ్ముడికి కిషోర్!

మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ

'కాలేజ్ కుమార్' ను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది - రాహుల్ విజయ్

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణ లో ఎల్ పద్మనాభనిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో