close
Choose your channels

‘బాబుపై హత్యకు కుట్ర.. జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా!’

Sunday, August 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘బాబుపై హత్యకు కుట్ర.. జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా!’

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట ఇంట్లోకి డ్రోన్‌లు వెళ్లడంతో ఏపీలో ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోందని చెప్పుకోవచ్చు. అసలు ఆ డ్రోన్‌లు ఎందుకు లోనికి పంపించారనే విషయాన్ని నిశితంగా ఆలోచించాల్సిందిపోయి తెలుగు తమ్ముళ్లు నోటికొచ్చినట్లుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని పలువురు సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

చేశారు. చంద్రబాబును‌ హతమార్చేందుకు ఏపీలో కుట్ర జరుగుతోందని బుద్దా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. చంద్రబాబును‌ రక్షించుకోవడం కోసం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య ‌చేసుకుంటానని.. మీరు చేసే కుట్రను భగ్నం ‌చేయడానికి తాను పోవడానికైనా సిద్ధమని బుద్దా చెప్పుకొచ్చారు.

ఆయనపైనే అనుమానం!?
" వైఎస్ జగన్ అధికారంలోకి‌ వచ్చాక చంద్రబాబుకు భద్రత తగ్గించారు.హైకోర్ట్ చంద్రబాబుకు‌ భద్రత పెంచండని‌ చెబితే‌ అది‌ చెబితే అది కూడా పక్కన పెట్టారు. కావాలనే చంద్రబాబు ఉంటున్న ఇళ్లును‌ డ్రోన్‌తో అడుగడుగు విజువల్స్ తీసారు

చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగమే ఆయన ఇంటిని‌ అణువణువు డ్రోన్‌తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు.మంత్రులే రెక్కి నిర్వహిస్తున్నారని‌ మాకు అనుమానం ఉంది. ప్రాణహాని ఉన్న వ్యక్తి ఇంటిని డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీసేముందు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి గత 15 రోజులుగా మాట్లాడుతున్న మాటలతో మాకు అనుమానం కలుగుతోంది. చంద్రబాబు చంపాలనే కుట్ర గురించి భారతదేశం మొత్తం ప్రజలకు తెలియాలి" అని బుద్దా చెప్పుకొచ్చారు

అదే చంద్రబాబైతే ఎక్కడున్నా!

"వరద వస్తే సరదగా మంత్రులు బ్యారేజ్ ఎక్కి‌ చూస్తున్నారు. లంక గ్రామాల‌ ప్రజలు ఇబ్బందులు గాలికి వదిలేసారు. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ సీఎం జగన్ అమెరికాలో ‌విలాశవంతమైన జీవితం.. అదే చంద్రబాబు అయితే ఎక్కడ ఉన్నా వెంటనే రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేవారు. జగన్ 70 రోజుల పాలనను గాలికి వదిలేసారు" అని బుద్దా విమర్శలు గుప్పించారు. అయితే బుద్దా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ముఖ్యంగా మంత్రులు, ఆళ్ల ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.