close
Choose your channels

ఇంటర్వ్యూ : గ్లామర్ రోల్స్ కి అభ్యంతరం లేదు- తెలుగమ్మాయి మాయ

Tuesday, July 27, 2021 • తెలుగు Comments

తెలుగమ్మాయి మాయ నెల్లూరి న్యూజిలాండ్ లో సెటిల్ అయింది. నటనపై ఆసక్తితో టాలీవుడ్ లో అవకాశాల కోసం తిరిగి ఇండియాకి వచ్చింది. రణరంగం చిత్రంలో ఓ రోల్ లో మెరిసిన మాయ.. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇండియా గ్లిట్జ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాయ నెల్లూరి తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు.

టాలీవుడ్ జర్నీ ఎలా అనిపిస్తోంది ?

చిన్నతనం నుంచే నాకు తెలుగు సినిమా అంటే పిచ్చి. తెలుగు సినిమాలో నటించడం అంటే చాలా గొప్పగా భావిస్తాను. కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా చేశాను. ఎలాగైనా టాలీవుడ్ తో కనెక్ట్ ఐ ఉండాలనేదే నా కోరిక. భవిష్యత్తులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.

లాక్ డౌన్ టైం ఎలా స్పెండ్ చేశారు ?

లాక్ డౌన్ టైంలో ఎక్కువగా పెయింటింగ్ తో గడిపాను. పెయింటింగ్ చిన్నప్పటి నుంచి హాబీ. కానీ గత ఏడేళ్ల నుంచి ప్రొఫెషనల్ గా పెయింటింగ్ చేస్తున్నా. పెయింటింగ్ లో ఇండియా, ఆస్ట్రేలియాలో ఎగ్జిబిషన్స్ చేశాను. ప్రస్తుతం ఆన్లైన్ ఎగ్జిబిషన్స్ చేస్తున్నాను.

నటిగా ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ?

నా ఫస్ట్ మూవీ రణరంగం. ఆ చిత్రంలో నాకు సుధీర్ వర్మ సర్ మంచి అవకాశం ఇచ్చారు. రణరంగం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అందులో కొన్నింటిని మాత్రమే ఎంచుకున్నా. నా కెరీర్ కు ఉపయోగపడే ఆఫర్స్ నే ఒకే చేశా. జీ5 వెబ్ సిరీస్ అనగనగాలో లీడ్ గా చేశా. ఈ వెబ్ సిరీస్ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే జూలై 30న రిలీజ్ కాబోతున్న తిమ్మరుసులో కూడా ఓ రోల్ చేశా. ఈ చిత్రం కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చైతన్య కృష్ణతో ఓ చిత్రంలో నటించా.

పెయింటింగ్, నటన పై ఆసక్తి ఎలా ఏర్పడింది ?

ఆసక్తి ఎలా ఏర్పడిందో తెలియదు కానీ.. చిన్నప్పటి నుంచే నాకు యాక్టింగ్, పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా ఆ రెండింటిని కొనసాగిస్తుండడం సంతోషంగా ఉంది.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు.. నటిగా ఏమైనా గోల్స్ ఉన్నాయా ?

సరిగ్గా ఇలాంటి పాత్రలే చేయాలని ఏమీ లేదు. ఎలాంటి పాత్ర అయినా కథ బావుండాలనేది నా ఒపీనియన్. కథ బావుంటే ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి కథలతో చిత్రాలు చేయాలనేదే నా గోల్. ప్రత్యేకంగా ఎలాంటి గోల్స్ లేవు.

మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి ?

మా కుటుంబం 90వ దశకం చివర్లో న్యూజిలాండ్ కు వెళ్ళాం. నా స్కూలింగ్, కాలేజ్ మొత్తం అక్కడే ముగిసింది. ఆ తర్వాత నేను సినిమాల్లో నటించేందుకు ఇండియాకు వచ్చా. మా కుటుంబ సభ్యులం అంతా ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుకుంటాం. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్నారు.

మీ ఆర్ట్ వర్క్ పై సెలెబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

చాలా మంది సెలెబ్రటీలని నేను ఇంటర్వ్యూ చేశా. ఆ పరిచయంతోనే నా ఆర్ట్ వర్క్ ని వారు సందర్శించారు. వాళ్లంతా నా ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవడం నిజంగా గ్రేట్ ఫుల్.

సినిమాల్లో గ్లామర్ రోల్స్ పై మీ అభిప్రాయం ?

గ్లామర్ రోల్స్ పై నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎలా నటించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది కథ నుంచి రావాలి. బలవంతంగా క్రియేట్ చేసినట్లు ఉండకూడదు. అలాగైతే గ్లామర్ రోల్స్ చేసేందుకు నాకెలాంటి అబ్జెక్షన్ లేదు.

నటిగా కొన్ని చిత్రాలు చేశారు. మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ?

నేను చేసింది తక్కువ చిత్రాలే. కానీ ప్రతి చిత్రంలో బాగానే చేశావు అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రోల్స్ చేసి ప్రశంసలు దక్కించుకుంటాను.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?

తిమ్మరుసు కోసం ఎదురుచూస్తున్నా. అలాగే చైతన్య కృష్ణతో నటించిన చిత్రం కూడా  త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాల రెస్పాన్స్ చూసి నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్  సెలెక్ట్ చేసుకుంటా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz