వరుసగా మూడోసారి..

  • IndiaGlitz, [Monday,September 04 2017]

'బిచ్చ‌గాడు'.. పేరుకి డ‌బ్బింగ్ సినిమా అయినా గ‌తేడాది సంచ‌ల‌నం సృష్టించిన సినిమా ఇది. టైటిల్ రోల్ లో విజ‌య్ ఆంటోని న‌ట‌న గుర్తుండిపోతుంది. సంగీత ద‌ర్శ‌కుడు నుంచి క‌థానాయ‌కుడిగా అవ‌తారం ఎత్తిన విజ‌య్‌.. 'బిచ్చ‌గాడు' కంటే ముందు వ‌చ్చిన 'న‌కిలీ', 'డా.స‌లీం' చిత్రాల‌లోనూ.. ఆ త‌రువాత వ‌చ్చిన 'బేతాళుడు', 'య‌మ‌న్' చిత్రాల‌లోనూ డిఫ‌రెంట్ రోల్స్‌నే చేశాడు. కాగా.. విజ‌య్ ఆంటోని హీరోగా త‌మిళంలో రూపొందిన 'అన్నాదురై' చిత్రం నిర్మాణం పూర్తిచేసుకుంది.

తెలుగులో 'ఇంద్ర‌సేన' పేరుతో రానున్న ఈ చిత్రం న‌వంబ‌ర్‌లో ఒకేసారి రెండు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విజ‌య్ అన్నాద‌మ్ములుగా రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌. గ‌త రెండు చిత్రాలు 'బేతాళుడు, య‌మ‌న్' లోనూ రెండేసి పాత్ర‌లు చేసి ఉన్న విజ‌య్‌కి.. ద్విపాత్రాభిన‌యం విష‌యంలో ఇది మూడో ప్ర‌య‌త్నం. బేతాళుడు, య‌మ‌న్ ఆశించిన విజ‌యాలు సాధించ‌లేదు.. మ‌రి ఇంద్ర‌సేన అయినా స‌క్సెస్‌ని అందిస్తుందో లేదో చూడాలి.

More News

కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేకర్స్ కొత్త చిత్రం ప్రారంభం

వింగ్స్ మూవీ మేకర్స్ బేనర్ పై కార్తీక్ రాజు,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా

బాలయ్యతో మరో కొత్త హీరోయిన్

ఇటీవలే 'పైసావసూల్ ' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నందమూరి బాలకృష్ణ.సినిమా ఫలితం ఎలా ఉన్నా..

'భలే భలే మగాడివోయ్ ' కి రెండేళ్లు

మతిమరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది.కాకపోతే..

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ 'కణం' దీపావళి విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో '2.0'చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్

'ఫిదా'కు ఇంత భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

వరుణ్తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదాస.ఎన్నో విజయవంతమై చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు