close
Choose your channels

పెద్ద ఆఫర్స్ వదిలేశా, ఇదే నా అసలైన తెలుగు డెబ్యూ : ప్రియా వారియర్

Tuesday, July 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కన్నుగీటిన వీడియోతో ఇండియా మొత్తం ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసింది ప్రియా వారియర్. కానీ నటిగా ప్రియా వారియర్ కు ఇంకా సరైన బ్రేక్ లభించలేదు. ప్రియా వారియర్ లేటెస్ట్ గా తెలుగులో నటించిన చిత్రం ఇష్క్. తేజ సజ్జ హీరో. జూలై 30న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రియా వారియర్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ వివరాలు ఇవే.

ఇష్క్ చిత్రంలో నటించే అవకాశం ఎలా దక్కింది ?

ఊహించని విధంగా ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ప్రతి సినిమాకి నేను కొన్ని నెలల గ్యాప్ తీసుకుంటాను. మధ్యలో చర్చలు జరిగిన తర్వాతే కొత్త చిత్రానికి ఒకే చెబుతాను. కానీ ఇష్క్ చిత్రాన్ని కేవలం రెండు రోజుల్లో ఒకే చేసి షూటింగ్ లో జాయిన్ అయ్యాను. ఆల్రెడీ మలయాళీ వర్షన్ చూశాను. మంచి కథ అనిపించి ఒప్పుకున్నాను.

మలయాళీ వర్షన్ నుంచి తెలుగు వర్షన్ కోసం ఏమైనా సలహాలు తీసుకున్నారా ?

లేదు. మలయాళంలో నటించిన నటి తన స్టైల్ లో చేసింది. కానీ ఇక్కడ అలా కాదు. దర్శకుడికి ఎం కావాలో అది చేశాను. రాజు సర్ నాకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా చేయగలిగాను.

కమర్షియల్ చిత్రాల్లో నటించడం మీకు కంఫర్టబుల్ గా ఉంటుందా ?

కమర్షియల్ చిత్రాలతో పాటు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని కూడా బ్యాలన్స్ చేయాలి. ఎందుకంటే అన్ని రకాల చిత్రాలు చూసే ఆడియన్స్ ఉన్నారు. కమర్షియల్ చిత్రాలు చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్, సహజత్వంతో కూడుకున్న చిత్రాలు కూడా చేయాలని ఉంది.

టాలీవుడ్ లో ఇది మీ పూర్తి స్థాయి డెబ్యూ మూవీ అనుకోవచ్చా ?

అవును. నా గత చిత్రం చెక్ లో 15 నుంచి 20 నిమిషాలు ఉండే రోల్ చేశాను. ఇష్క్ లో సినిమా మొత్తం ఉంటాను. కాబట్టి ఈ చిత్రం తెలుగులో నా డెబ్యూ మూవీ అనుకోవచ్చు.

ఇష్క్ లో మీ రోల్ ఎలా ఉండబోతోంది ?

నా రోల్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతోంది. ఈ సినిమా నేపథ్యం అలాగే ఉంటుంది. రెగ్యులర్ తరహాలో కాకుండా రొమాంటిక్ థ్రిల్లర్ లా ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటి యువతలో జరుగుతున్న అంశాలని ఆసక్తికరంగా చూపించబోతున్నాం.

మలయాళీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ.. మీ ప్రాధాన్యత దేనికి ?

అలా నేను ఆలోచించను. అక్కడ అవకాశాలు వస్తే మలయాళంలో నటిస్తాను.. ఇక్కడ ఆఫర్స్ వచ్చినా టాలీవుడ్ లో సినిమాలు చేస్తాను. ప్రస్తుతం మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నా.

తెలుగు నేర్చుకుంటున్నారా ?

తెలుగు వకాబులరీ అర్థం అవుతుంది. ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకుంటాను. ఇంకో రెండు సినిమాలు చేస్తే పూర్తిగా తెలుగు నేర్చుకుంటాను.

సినిమాల ఎంపికలో మీ ప్రాధాన్యత దేనికి ?

తప్పకుండా కథ. ఆ తర్వాత నా పాత్ర. ఈ రెండింటికే నా ప్రాధాన్యత. నా పాత్ర వల్ల సినిమా బలం పెరుగుతుందా లేదా అని ఆలోచిస్తాను. అలా అనిపిస్తేనే ఓకె చేస్తాను.

కన్నుగీటిన వీడియోతో వచ్చిన ఫేమ్ ని మీరు క్యాష్ చేసుకోగలిగారా ?

లేదు. వింక్ వీడియో వైరల్ అయ్యాక చాలా ఆఫర్స్ వచ్చాయి. అదే టైంలో స్టడీస్ పై కూడా ఫోకస్ పెట్టాను. దీనితో చాలా పెద్ద ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అని భావించే వ్యక్తిని నేను.

తేజ సజ్జ గురించి చెప్పండి ?

తేజ చాలా యాక్టివ్ గా ఉంటాడని మీ అందరికి తెలుసు. అందరిని నవ్విస్తూ సెట్స్ ని సందడిగా ఉంచుతాడు. తెలుగులో నాకు చాలా హెల్ప్ చేశాడు.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?

తెలుగులో ఓ చిత్రం చేస్తున్నా. అది అఫీషియల్ గా అనౌన్సమెంట్ రావాల్సి ఉంది. హిందీలో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. వాటి నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. మలయాళంలో మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.