రానా న్యూమూవీ టైటిల్ ఇదే..!

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల త‌ర్వాత రానా - తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ఈరోజు రానా ట్విట్ట‌ర్ లో గాజులుతో ఉన్న అమ్మాయి చెయ్యి, బ్రేస్ లెట్ ధ‌రించిన ఉన్న అబ్బాయి చెయ్యి ఫోటోను పోస్ట్ చేసారు.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు రానా, కాజ‌ల్. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింద‌ని రానా తెలియ‌చేస్తూ...నా సూప‌ర్ కో స్టార్ ను ప‌రిచ‌యం చేస్తున్నాను కాజ‌ల్ అగ‌ర్వాల్. న్యూ బిగినింగ్ అని ట్వీట్ చేసారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా రానా తో వ‌ర్క్ చేయ‌డం సూప‌ర్ ఫ‌న్ అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రానికి నేనే రాజు - నేనే మంత్రి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

'కోటికొక్కడు' ఆడియో విడుదల

సి.ఎల్.ఎన్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్శెట్టి అందిస్తున్న చిత్రం 'కోటికొక్కడు'. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిలుకూరి బాలాజీ

అల్లాణి శ్రీధర్ స్వీయదర్శకత్వంలో ఈటివి సౌజన్యంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిలుకూరి బాలీజీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ కారు సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తి

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్టైగర్'వంటి సూపర్హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నవీన్చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్ పూర్తయింది.

భద్రాద్రి మూవీస్ 'కత్తిలాంటి కుర్రాడు' ప్రారంభం

భద్రాద్రి మూవీస్ బ్యానర్పై విసుశ్రీ, అక్ష, హమీదా హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం కత్తిలాంటి కుర్రాడు విజయదశమి సందర్భంగా హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది.

ఆస్ట్రేలియాలో పాటల చిత్రీకరణలో స్టైలిష్ ఎంటర్ టైనర్ క్రికెటర్ శ్రీశాంత్ 'టీమ్ 5' చిత్రం

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి క్రికేటర్ నే కాదు మంచి డ్యాన్సర్ అని ఈచిత్రంతో తెలుస్తుంది. రాజ్ జకారిస్ ప్రోడ్యూసర్ గా తన ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.