సూర్య 24 కథ ఇదే...

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

సూర్య హీరోగా మనం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ మూవీ 24. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు. సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..24 సినిమా క‌థ ఏమిట‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే తాజాగా 24 క‌థ కాస్త లీక్ అయ్యింది.
అదేమిటంటే...ఈ సినిమాలో హీరో సూర్య వాచీ రిపేర్ షాపు న‌డుపుతుంటాడ‌ట‌. సూర్య ద‌గ్గ‌ర‌కి ఓ వాచీ రిపేర్ కి వ‌స్తుంది. ఆ వాచీ ఓ టైమ్ మిష‌న్. ఆ వాచీని త‌యారు చేసిన సైంటిస్ట్ దానిని పోగొట్టుకుంటాడ‌ట‌. ఆ టైమ్ మిష‌న్ ని ఆప‌రేట్ చేస్తూ భ‌విష్య‌త్ కాలంలోకి వెళ‌తాడ‌ట సూర్య‌. ప్ర‌యాణం నేప‌ధ్యం...రోజుకి 24 గంట‌లు..దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 24 అనే టైటిల్ పెట్టార‌ట‌. అదీ సంగ‌తి. మ‌రి... స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న 24 ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

ఇద్దరితో ఆమె చేయడం లేదట...

నేను..శైలజతో సక్సెస్ తో టాలీవుడ్ చూపు హీరోయిన్ కీర్తి సురేష్ పై తిరిగింది.

స‌ర్దార్ ఆడియో రైట్స్ రేట్ అదిరింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

బాలయ్య వందో సినిమా హీరోయిన్ ఎవరంటే..

డిక్టేటర్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.ఇప్పుడు అందరి చూపు బాలయ్య వందో సినిమాపై ఉంది.బాలయ్య తన వందో సినిమాను బోయపాటితో చేస్తాడని అందరూ అనుకున్నారు.

ప‌డేసావే..ఫ‌స్ట్ సాంగ్ లాంఛ్..

కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంట‌గా చునియ తొలి ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్రం ప‌డేసావే. అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప‌డేసావే టీజ‌ర్ ను నాగ్, రాఘ‌వేంద్ర‌రావు లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే.

తుది దశకు చేరుకున్న 'కబాలి' షూటింగ్....

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'కబాలి'.ఈ సినిమాలో ఆయన లుక్ కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది.