'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

  • IndiaGlitz, [Friday,December 06 2019]

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది.

ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

More News

సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

`సింహ, లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో

శ్రీవిష్ణు హీరోగా 'ఎల్.ఎల్.పి' చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.

ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం లభించింది: పవన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ బాధితురాలి తల్లిదండ్రులు..

శభాష్ పోలీస్ అంటూ పూల వర్షం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.