close
Choose your channels

'రోబో' గురించి అక్ష‌య్ కుమార్ ఏమ‌న్నారంటే..!

Saturday, November 3, 2018 • తెలుగు Comments
2.0
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రోబో గురించి అక్ష‌య్ కుమార్ ఏమ‌న్నారంటే..!

అక్ష‌య్‌కుమార్ '2.0'లో కీల‌క పాత్ర పోషించారు. ర‌జనీకాంత్‌, ఎమీ జాక్స‌న్ జంట‌గా న‌టించిన సినిమా '2.0'.

సినిమా ట్రైల‌ర్ వేడుక‌లో పాల్గొన్న అక్ష‌య్ కుమార్ మాట్లాడుతూ "2, 3 గంట‌లు ప్రాక్టీస్ చేసి త‌మిళ్ లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. ర‌జ‌నీ సార్‌, శంక‌ర్ సార్‌, రెహ‌మాన్‌గారితో క‌లిసి '2.0'లో నా పేరు కూడా ఉండ‌టం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం న‌న్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధ‌న్య‌వాదాలు" అని అన్నారు.

అనంత‌రం విశాల్ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన‌ ప్ర‌శ్న‌కు అక్ష‌య్‌ స‌మాధాన‌మిస్తూ "నాకు నా జిమ్ ఉంది. నేను ప్ర‌తి రోజూ ఉద‌యం 4 గంట‌ల‌కు లేస్తా మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్న‌త‌నం నుంచి చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. ఎవ‌రూ నన్ను ఇలాగే చేయ‌మ‌ని ఫోర్స్ చేయ‌లేదు. నా జీవితంలో ప్ర‌తి రోజూ నేను స‌న్‌రైజ్‌ని చూస్తాను.

నేను ప్ర‌తి రోజునూ, ప్ర‌తి క్ష‌ణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శ‌రీర‌మే దేవాల‌యం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్ గురించి తెలుసు. త‌ను అన్నం తిన‌డ‌ని నాకు తెలుసు. వాళ్ల అమ్మ‌కు అది న‌చ్చ‌ద‌ని కూడా నేను చ‌దివా. క‌నీసం ఆదివార‌మైనా అన్నం, దోస‌లు, ఇడ్లీలు తినాల‌ని ఆశిస్తున్నా" అని అన్నారు.

కృతిక అనే ఫ్యాన్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ "ఈ సినిమా వ‌ల్ల నేను చాలా నేర్చుకున్నా. శంక‌ర్ నా దృష్టిలో సైంటిస్ట్. ఆయ‌న డైర‌క్ట‌ర్ మాత్ర‌మే కాదు. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నా. మూడున్న‌ర గంట‌లు కూర్చుని మేక‌ప్ చేసుకోవ‌డం, ఏడాదిన్న‌ర దాన్ని తీసుకోవ‌డం నేను మ‌ర్చిపోలేను. నేను గ‌త 28 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా ఏసుకున్న మేక‌ప్ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేక‌ప్‌తో స‌రితూగ‌దు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంక‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు" అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.