ఇదో గుణ‌పాఠం కావాలి

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

ఢిల్లీ యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితాధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే 'చ‌పాక్' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె న‌టిస్తున్నారు. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌కురాలు. రీసెంట్‌గా ఈ సినిమా గురించి ల‌క్ష్మీ అగ‌ర్వాల్ స్పందించారు. ''నేను స్కూల్లో ఉన్న‌ప్పుడు ఎలాంటి ప‌త‌కాలు గెలుచుకోలేదు. అయినా నా బ‌యోపిక్ రూపొందుతుంద‌ని నేను అనుకోలేదు. మేఘ‌నా గుల్జార్‌కు ధ‌న్య‌వాదాలు.

యాసిడ్ దాడి బాధితురాలినైన నా గురించి.. నేను చేస్తోన్న మంచి ప‌నిని సినిమా రూపంలో తీసుకొస్తున్నందుకు ఆమెకు రుణ‌ప‌డి ఉంటాను. నా జీవితాన్ని నాశనం చేసిన వాడికి, న‌న్ను ఓ క్రిమిన‌ల్‌గా చూసిన స‌మానికి ఈ సినిమా ఓ గుణ‌పాఠం అవుతుంద‌ని అనుకుంటున్నాను'' అని తెలిపారు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ఢిల్లీలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణంలో కూడా దీపికా ప‌దుకొనె భాగ‌స్వామిగా మారారు.