close
Choose your channels

Theater & OTT Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే... ఒకే రోజు దిగుతున్న రవితేజ, నిఖిల్

Thursday, December 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ బాగా వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు.. అది ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అంటూ ఈ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. పెరిగిన టికెట్ ధరల కారణంగా ఇంటిల్లిపాది థియేటర్‌కు వెళ్లి చూడాలంటే జేబుకు చిల్లు పడుతుందనే భయంతో ఓటీటీలోకి వచ్చేదాకా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీల్లోకి వస్తుంటే.. మరికొన్ని మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

ఒకే రోజున ధమాకా, 18 పేజేస్ :

ఇదిలావుండగా .. ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్‌లో , ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. క్రిస్మస్ పర్వదినం, వరుస సెలవుల నేపథ్యంలో ఈ వారం ఎక్కువ సినిమాలు రిలీజ్‌ పెట్టుకున్నాయి. ముందుగా థియేటర్‌లోకి వచ్చే సినిమాల విషయానికి వస్తే.. విశాల్ నటించిన ‘‘లాఠీ’’ తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇక లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన హార్రర్ థ్రిల్లర్ ‘‘కనెక్ట్’’ కూడా ఇదే రోజున రానుంది. మలయాళ చిత్రం ‘‘కాప’’ కూడా 22నే ప్రేక్షకుల మందుకు రానుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘‘ధమాకా’’ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. అదే రోజున నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘‘18 పేజేస్’’ కూడా విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘‘సర్కస్’’ కూడా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ ప్రియులను భయపెట్టనున్న మసూద:

ఇక ఓటీటీ విషయానికి వస్తే.. సీనియర్ నటి సంగీత నటించిన హర్రర్ చిత్రం ‘‘మసూద’’ డిసెంబర్ 21న ఆహాలో ... అల్లరి నరేశ్ నటించిన ‘‘ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’’ డిసెంబర్ 23న జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలోనూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.