ఏపీకి వచ్చిన ఆ 185 మందికి కరోనా లేదు!

  • IndiaGlitz, [Thursday,March 19 2020]

కరోనా వైరస్‌ మూలంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కేంద్రం సహాయంతో స్వదేశానికి రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకొన్న సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు బుధవారం నాడు ఏపీలోని విశాఖకు క్షేమంగా వచ్చారు. వాళ్ల రాకతో ఒక్కసారికి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజానీకం భయంతో వణికిపోయింది. విదేశాల నుంచి రావడంతో వారికి కరోనా ఉందేమో..? ఒకవేళ ఉంటే ఎక్కడ మనకు సోకుతుందో..? అని జనాలు బెంబేలెత్తిపోయారు. అయితే ఇలా అనుమానాలు, అపోహాలపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజకిశోర్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.

టెస్ట్‌లు చేశాం.. ఎవరికీ లేదు!

‘కౌలాలంపూర్ నుంచి 185 మంది విద్యార్థులు వచ్చారు. వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 91 మంది, తెలంగాణకు చెందిన వారు 10మంది, తమిళనాడుకు చెందిన వారు 77మంది, కేరళకు చెందిన వారు ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఒక్కరు, మహరాష్ట్రకు చెందిన వారు ముగ్గురు, ఒరిస్సాకు చెందిన వారు ఒక్కరు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు చేశాం. ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో అందర్నీ ఇంటికి పంపుతున్నాము’ అని రాజకిశోర్ మీడియాకు వెల్లడించారు.

More News

'ఆర్ఆర్ఆర్' నుండి వైదొలుగుతున్న అలియా భట్ ?

బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సిద్ధార్థ్‌తో రిలేష‌న్ గురించి స‌మంత ఏం చెప్పిందో తెలుసా?

హీరోయిన్‌గా స‌మంత కెరీర్ ప్రారంభంలో మంచి విజ‌యాలు సాధించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అదే స‌మ‌యంలో హీరో సిద్ధార్థ్‌తో కొంత‌కాలం రిలేష‌న్ షిప్ కొన‌సాగించింది.

కరోనా విషయంలో రూల్స్ పాటించండి..: నిశ్శబ్దం టీమ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 271 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు.

లీకుల‌పై మెగాస్టార్ అస‌హ‌నం?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య‌’ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

కరోనా భయంతో మాస్క్ పెట్టుకోవడం అవసరమా!?

కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కరకంగా జాగ్రత్తలు చెబుతుండటం..