close
Choose your channels

‘జబర్దస్త్’ సక్సెస్‌కు ఆ ఇద్దరే కారణం: అనసూయ

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జబర్దస్త్’ సక్సెస్‌కు ఆ ఇద్దరే కారణం : అనసూయ

జబర్దస్త్ కామెడీ షో.. ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. గురు, శుక్రవారం రోజులొస్తే చాలు అటు టీవీ చానెల్స్ ముందు.. ఇటు యూ ట్యూబ్‌లో చూడటానికి జనాలు క్యూ కడుతుంటారు. ఈ షో ఇంతలా సక్సెస్ అవ్వడం వెనుక ఎంతో మంది ఆర్టిస్టులు, డైరెక్టర్స్‌తో పలు డిపార్ట్‌మెంట్స్‌ సహాయ సహకారాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. అంతేకాదు ఇవన్నీ ఒక ఎత్తయితే వీడియో ఎడిటింగ్ మరో ఎత్తు.. ఇక్కడ ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.

ఈ షోకు.. అనసూయ, రష్మీ గౌతమ్ ఇద్దరు యాంకర్‌లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ షో సక్సెస్‌కు కారణాలేంటి అనే విషయమై సోషల్ మీడియా వేదికగా అనసూయ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. జబర్దస్త్‌కు మంచి ప్రశంసలు వస్తుంటాయని వాటితో పాటు తీవ్రమైన విమర్శలు దక్కాయని ఈ హాట్ భామ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ లక్షలాది మంది మోముల్లో ప్రతివారం మేం నువ్వులను పూయిస్తున్నామంది.

దాదాపు అర్ధ దశాబ్దం దాటినా ఈ షోను విజయవంతంగా కొనసాగిస్తున్నామనీ, ఇందుకు దర్శకులు నితిన్, భరత్ ఇద్దరే కారణమని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. తాను సెట్‌లో ఏం అడిగినా, ఫిర్యాదు చేయాలనుకున్నా, సలహాలు కోరినా ఈ ఇద్దరు దర్శకులు హుందాగా, ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవారని భరత్, నితిన్‌లపై ప్రశంసల వర్షం కురిపిచింది. ఈ ఇద్దరూ జీవితంలో సరికొత్త ఎత్తులకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తన ట్విట్టర్ అనసూయ చెప్పుకొచ్చింది. కాగా.. జబర్దస్త్‌కు అనసూయ గుడ్ బై చెప్పేస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ట్వీట్‌ మరింత బలం చేకూరుస్తోంది. సో..ఫైనల్‌గా ఆమె జబర్దస్త్‌లో ఉంటుందో బయటికొచ్చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.