Pawan Kalyan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు ఆ నలుగురిదే బాధ్యత: పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,April 15 2024]

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారుల చేతే విచారణ చేయించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనకు రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషన్, సీఎం భద్రతాధికారుల వైఫల్యమేనని జనసేనాని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు... చెట్లూ కొట్టలేదు.

ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి... ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కాగా సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై దర్యాప్తునకు విజయవాడ సిటీ కమిషనర్ క్రాంతి రాణా 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు

More News

Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఒకేరోజు రెండు షాక్‌లు..

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒక్కరైన నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో కీలక విషయాలు గుర్తింపు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌

Vishal: తమిళనాట వేడెక్కిన రాజకీయాలు.. కొత్త పార్టీ పెడతానంటూ విశాల్ సంచలన ప్రకటన..

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటంతో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Kavitha: ఈనెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ.. బీజేసీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు..

లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడల్లా ఊరట లభించేలా కనిపించడం లేదు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది.