ఆ టీడీపీ ఎమ్మెల్యేకు ఈ సారి టికెట్ కష్టమేనా..!

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచిన తెనాలి శ్రావణ్‌‌ కుమార్‌‌కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కష్టమేనని తాజాగా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి ఇంత వరకూ ఆయన చేసిందేమీ లేదని మొదట్నుంచి శ్రావణ్‌పై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకూ కూడా ఆయనకు వ్యతిరేకంగా పవనాలు వీస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్తలే నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా తాడికొండలో జరిగిన సమావేశంతో మరోసారి జిల్లా రాజకీయాల్లో శ్రావణ్ హాట్ టాపిక్ అయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే..

ఇటీవల ఏపీఎన్జీఓ భవన్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దళితుల సమావేమయ్యారు. నాలుగు మండలాలకు చెందిన దళితలు హాజరై శ్రావణ్‌ ఏకపక్ష దోరణిపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలా ఆయన్ను వ్యతిరేకించడం మొదటసారేం కాదు. పలుమార్లు ఆయన వ్యతిరేకంగా సొంత సామాజికవర్గం వాళ్లే తిరుగుబాటు చేసినప్పటికీ ఆయనలో ఏ మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. ఇలా రోజు రోజుకు ఆయనకు వ్యతిరేకమయ్యే వారే తప్ప ఆయన్ను ఎవరూ సమర్థించట్లేదని పలువురు ద్వితియ శ్రేణి నేతలు చెబుతున్నారు.

శ్రావణ్‌కు అండగా మేముంటే..!

ఈ సమావేశంలో పలువురు దళిత నేతలు మాట్లాడుతూ.. శ్రావణ్ పేరు కూడా తెలియని పరిస్థితుల్లో తాడికొండలో తళితులు ఆయన వెనుక నిలిచాం. శ్రావణ్‌ను గెలిపించి ఎమ్మెల్యే‌ని చేస్తే.. ఆయన గెలుపు కోసం కృషి చేసిన వారిని విస్మరించారు. మమ్మల్ని గౌరవించకపోగా తిరిగి మాపైనే కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా శ్రాశణ్ కుమార్ దళితులను మోసం చేశారు. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ అదిష్టానాన్ని విన్నవించుకుంటున్నాము. శ్రవణ్‌కు కాకుండా స్థానికులకు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే గెలిపించుకుని సమస్యలు పరిష్కరించుకుంటాం. స్థానికుల అభిప్రాయాలను కాదని టీడీపీ.. శ్రావణ్‌ను అభ్యర్దిగా ప్రకటిస్తే అయనను ఓడించేలా పని చేస్తాం అని టీడీపీ దళిత నేతలు తేల్చిచెప్పారు. అయితే ఈ స్థాయిలో ఉన్న వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకు సీఎం చంద్రబాబు మళ్లీ టికెట్ ఇస్తారా..? లేకుంటే ఇవ్వకుండా వేరొకరి పేరును ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

మార్చ్ 1 న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ '118'

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `118`.

విశాల్ పెళ్లి వెన్యూ ఫిక్స్!

తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోగా మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నాడు. సాధారణంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ వుంటారు.

16 ఏళ్ల తర్వాత...

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సౌందర్య, జగపతిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రాన్ని నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా హిందీలో కూడా కృష్ణవంశీ రీమేక్ చేశారు.

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ 'ఉండిపోరాదే..'

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో

ఫార్ములా సినిమానే కావాలి...

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.