ముందే వ‌స్తున్న ఆ రెండు చిత్రాలు

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

ఓ సినిమాని అనుకున్న తేదికి అనుకున్న‌ట్లుగా విడుద‌ల చేయ‌డం అన్ని సంద‌ర్భాల్లోనూ సాధ్య‌ప‌డ‌దు. ఎక్కువ సార్లు వాయిదా వేసే ప‌రిస్థితులు ఉంటే.. అతి త‌క్కువ సంద‌ర్భాల్లో అనుకున్న స‌మ‌యం కంటే ముందే విడుద‌ల చేసే ప‌రిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అలా రెండు సినిమాలు.. తాజాగా ప్ర‌క‌టించిన తేదీల కంటే ముందే రాబోతున్నాయి.

ఇంత‌కీ ఆ చిత్రాలేమిటంటే.. 'కిరాక్ పార్టీ', 'ఎం.ఎల్‌.ఎ'. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ'ని తెలుగులో యువ క‌థానాయ‌కుడు నిఖిల్ 'కిరాక్ పార్టీ' పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని తొలుత ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేయాలనుకున్నారు. త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల మార్చి 22కి వాయిదా వేశారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మార్చి 16న ఈ సినిమా రానుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అలాగే క‌ళ్యాణ్ రామ్‌, కాజ‌ల్ జంట‌గా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఎం.ఎల్‌.ఎ' చిత్రాన్ని తొలుత మార్చి 28న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే.. 'రంగ‌స్థ‌లం' మార్చి 30న విడుద‌ల కానుండ‌డంతో ఒక వారం ముందే అంటే మార్చి 23న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌స్తుంది.

More News

మ‌హేష్‌ పై కైరా ప్ర‌శంస‌ల వ‌ర్షం

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మహేష్ సమైఖ్యాంధ్ర ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ న‌టి కైరా అద్వాని ఈ సినిమా ద్వారా  తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

'వాడేనా' గీతావిష్కరణ

నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం సాయి రామ్ సమర్పణలో శివ తాండేల్,నేహా దేశ్ పాండే జంటగా నటిస్తున్న చిత్రం 'వాడేనా'.

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'సమ్మోహనం'

సుధీర్ బాబు,బాలీవుడ్ నటి అదితిరావు హైదరీ జంటగా మోహన కృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వంలో

'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య..' మధ్య కుదిరిన ఒప్పందం

ఏప్రిల్ 26నే 'భరత్ అనే నేను','నా పేరు సూర్య'విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో

47డేస్ , మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్

సత్యదేవ్,పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్.