close
Choose your channels

కరోనా అంతమైందంటూ పార్టీ.. వేలల్లో హాజరైన ప్రజలు

Friday, July 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా కారణంగా ప్రపంచమే వణికిపోతుంటే.. ఓ దేశంలో మాత్రం ‘కరోనా వైరస్ పార్టీ’ పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం జరిగింది. ఈ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ వింత పోకడకు ప్రేగ్ కేంద్రంగా నిలిచింది. విషయం తెలుసుకుని ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. సీజెక్ రిపబ్లిక్ దేశంలో లాక్‌డౌన్ నిబంధనలను తొలగించారు.

నిబంధనలు తొలగించి నెలరోజులు దాటుతున్న నేపథ్యంలో ప్రేగ్‌లో కరోనా వైరస్ ఫేరెవెల్ పార్టీ ఓ భారీ బహిరంగ కార్యక్రమం జరిగింది. దీనికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నవ్విపోదురుగాక అని ఎవరనుకున్నా.. నిస్సిగ్గుగా ఈ పార్టీ జరిగిపోయింది. ప్రేగ్‌లోని ఓ కెఫే యజమాని అయిన ఓంద్రేజ్ కోబ్జా ఈ పార్టీని ప్రఖ్యాత చార్లెస్ బ్రిడ్జిపై నిర్వహించారు. అతిథుల కోసం ఏకంగా 500 మీటర్ల పొడవైన టేబుల్ వేశాడు. ఈ టేబుల్ పట్టనంత మంది జనం ఈ పార్టీకి హాజరవడం విశేషం. ఇదేమని కోబ్జాను అడిగితే.. కరోనా మహమ్మారి అంతమైందని అందుకే ఈ వేడుక నిర్వహించానని చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.