close
Choose your channels

విజయ్‌ సేతుపతికి బెదిరింపు

Tuesday, October 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్‌ సేతుపతికి బెదిరింపు

అసలు మనుషులు ఏమైపోతున్నారు.. మానవత్వం కనపడటం లేదేంటి? అనే భావన కనపడుతోంది జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే..ఎందుకంటే సెలబ్రిటీలకు సోషల్‌ మీడియాలోనే డైరెక్ట్‌గా బెదిరింపులు వస్తున్నాయి. నిన్నటికి నిన్న టీంఇండియా మాజీ కెప్టెన్‌ ధోని కుమార్తెను రేప్‌ చేస్తామంటూ ఓ టీనేజర్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ నటుడు విజయ్‌ సేతుపతికి అలాంటి బెదిరింపులే వచ్చాయి. శ్రీలంకన్‌ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో నటించడానికి విజయ్‌ సేతుపతి సమ్మతించిన తర్వాత తమిళుల నుండే కాదు.. సినీ పరిశ్రమ నుండి కూడా విజయ్‌ సేతుపతికి వద్దని అభ్యర్థనలు వచ్చాయి. శ్రీలంకలో తమిళులపై జరిగిన దారుణకాండకు అప్పట్లో ముత్తయ్య మురళీధరన్‌ సపోర్ట్‌ చేశాడంటూ తమిళులందరూ విజయ్‌సేతుపతికి ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోమని సూచించారు.

విజయ్‌ సేతుపతికి వస్తున్న వ్యతిరేకతను గమనించిన ముత్తయ్య మురళీధరన్‌ సైతం విజయ్‌ సేతుపతిని ప్రాజెక్ట్‌ నుండి తప్పుకోమని సూచిస్తూ లేఖ రాశాడు. దానికి విజయ్‌ సేతుపతి కూడా ట్విట్టర్‌లో తన సమ్మతిని తెలియజేశాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ సోషల్ మీడియాలో "తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుంది" అంటూ మెసేజ్‌ పోస్ట్‌ చేశాడు. దీంతో అందరూ సదరు నెటిజన్‌ తీరుని తప్పు పట్టారు. ఇలాంటి వ్యక్తుల వల్లనే అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ, చూస్తు ఊరుకున్నారంటే సిగ్గుచేటు అంటూ సింగర్‌ చిన్మయి డిప్యూటీ కమీషనర్‌ను ట్యాగ్‌చేస్తూ నెటిజన్‌ తీరుని తప్పుపట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.