సింహాచలం: ప్రారంభమైన త్రిసభ్య కమిటీ విచారణ


Send us your feedback to audioarticles@vaarta.com


విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఘటనా స్థలంకు త్రిసభ్య విచారణ కమిటీ చేరకున్నారు.
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు కాగా.. కమిషన్ లో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ ముగ్గురు ఈ దుర్ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో దిగిన కమిటీ, 72 గంటల్లో, అంటే రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వారితో పాటుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక బ్రత బాక్చి ఆలయ నిర్వహణ కార్యనిర్వాహన అధికారులు కమిటీతో పాటు విచారణ సాగిస్తున్నారు.
ముందుగా గోడ కట్టిన కాంట్రాక్టర్ ను కమిటీ ప్రశ్నించింది. కాంట్రాక్టర్ లక్ష్మణరావు కీలక విషయాన్ని వెల్లడించారు. సరిగ్గా చందనోత్సవానికి కొన్ని రోజుల ముందు అధికారులు తనను సంప్రదించారని, గోడ కట్టాలని ఒత్తిడి చేశారని ఆరోపించాడు.
ఇంత తక్కువ టైమ్ లో గోడ కట్టడం సాధ్యంకాదని చెప్పినా వినలేదని, తాత్కాలికంగా నిర్మించాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, చందనోత్సవానికి 4 రోజుల ముందు గోడ కట్టానని వెల్లడించాడు కాంట్రాక్టర్. ఇదే గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com