ఒకే రోజున‌ ముగ్గురు స్టార్ హీరోల వాయిస్ ఓవ‌ర్స్‌

  • IndiaGlitz, [Wednesday,February 14 2018]

ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సినిమాకి మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే!?...ఈ రెండు కూడా గతంలో 'జల్సా', 'మర్యాద రామన్న' సినిమాలో చూసాం. మళ్ళీ ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతోంది.. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) విడుదల కానున్న 'మనసుకు నచ్చింది', 'అ!' సినిమాలతో. ఈ రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కించిన చిత్రాలే కావడం విశేషం.

"మనసుకు నచ్చిన పని చేయండి" అంటూ మంజుల ఆమె మనసుకు నచ్చిన దర్శకత్వ బాధ్యతను స్వీకరించి 'మనసుకు నచ్చింది' సినిమాని తెరకెక్కించారు. మనిషి జీవితం యాంత్రికంగా మారిందంటూ, ప్రకృతితో కలిసి ప్రయాణిస్తే....చాలా విషయాలు తెలుస్తాయని, సరిగ్గా ఇటువంటి విషయాలనే ఈ సినిమాలో చూపించడం జరిగిందని ఆమె ఇటీవల మీడియాకి తెలియజేసారు. ఇప్పటిదాకా విడుదలైన టీజర్, ట్రైలర్లలో ఈ విషయాన్నే ప్రస్తావించారు కూడా. అలాగే ఈ సినిమాలో ప్రకృతికి వాయిస్ ఓవర్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఇక నాని మొదటిసారి నిర్మిస్తున్న చిత్రం 'అ!'. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ తో పాటు ఒక చేప, బోన్సాయ్ చెట్టు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నాయి. చేప పాత్ర‌కి నాని, బోన్సాయ్ చెట్టు పాత్ర‌కి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే ఈ రెండు సినిమాలు ఆయా స్టార్ నటుల సొంత నిర్మాణ సంస్థలు (రవితేజ మినహా) కావడం విశేషం. మరి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏ మేర అలరిస్తాయో చూడాలి.

More News

వాయిదా ప‌డ‌నున్న క్రిష్ 'మణికర్ణిక'

తప్పుడు సమాచారంతో చేపట్టే ఆందోళనలతో సినీ పరిశ్రమ ఎంతో నష్టపోతోంది. నిన్నటివరకు ఈ ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అయింది 'పద్మావత్' సినిమా. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ప్రధాన పాత్రధారిణిగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం 'మణికర్ణిక'కు కూడా ఆందోళనల సెగ తగులుకుంది.

విశ్వ విఖ్యాత నట సామ్రాట్‌.. కైకాల సత్యనారాయణ - టి.సుబ్బరామిరెడ్డి

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది.

వేలంటైన్స్ డే సందర్భంగా 'సాక్ష్యం' ఫస్ట్ లుక్ విడుదల

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం' అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్న

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ 'ఛల్ మోహన్ రంగ' టీజర్

'ఛల్ మోహన్ రంగ''నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం.కథానాయకుడు నితిన్ కు 25వ చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. 

అనిరుధ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మిస్‌.. త‌మ‌న్ య‌స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ఈ చిత్రం....ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. మార్చి 26 నుంచి నిరవధిక చిత్రీకరణ జరుపుకోనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి.