Chandrababu:ప్రత్యర్థుల మీద రాళ్లు వేయించింది.. పత్రికల్లో రాయించేది చంద్రబాబే..!

  • IndiaGlitz, [Tuesday,April 16 2024]

దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గమనించే వారికి టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల గురించి బాగా తెలిసి ఉంటుంది. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు. తన ప్రత్యర్థుల మీద అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెబుతుంటారు. లొంగదీసుకోవడం లేదా బెదిరించడం లేదా అడ్డు తొలగించుకోవడం వంటి రాజకీయాలను నడుపుతూ వస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు అదే తరహా కుట్రలను ఏపీలో ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాయితో చంద్రబాబు దాడి చేయించారని.. తిరిగి ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని పేర్కొంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర సీఎం మీద రాయి దాడి జరిగితే ఖండించాల్సింది పోయి ఆయనే చేయించుకున్నారని లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ చేశారని తన మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరే... లేదంటే దాన్ని మళ్లీ బాధితుల మీదకే ప్రయోగించి రాయకీయ లబ్ధి పొందడంలో ఆయనను మించిన వారు లేరని చెబుతున్నారు.

పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే ఒక మాదిరి.. పరిస్థితులు ఎదురుతిరిగితే మరోలా రాజకీయం చేసేందుకు బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంటున్నారు. రెండువైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితులనే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు అని వివరిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ మీద రాయి దాడి విషయంలో ఇదే కుట్రలు అమలు చేస్తున్నా బాబు కుటిల బుద్ధి తెలిసిన ప్రజలు దీనిని నమ్మడం లేదని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టిందని.. అందుకే ఆ నింద సీఎం జగన్‌పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అందరికీ తెలిసిపోయిందంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ఓటుతో టీడీపీ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేస్తున్నారు.

More News

సోషల్ మీడియా వేదికగా వైసీపీపై టీడీపీ దుష్ప్రచారం.. లక్షల మందితో టీమ్..

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పీక్ స్టేజ్‌కి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు.

Kannappa:మంచు విష్ణు గట్టిగానే ప్లాన్ చేశాడుగా.. 'కన్నప్ప' మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో

మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

CM Jagan:సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.

Gaami :జీ5లో ‘గామి’ సెన్సేషన్.. 72 గంటల్లోపు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ముందు వరుసలో ఉంటుంది.

CM YS Jagan: దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు.. రాయి దాడిపై సీఎం జగన్ స్పందన ఇదే..

తనపై జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ స్పందించారు. గుడివాడలోని నాగవరప్పాడు వద్ద జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో తన గాయం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.