close
Choose your channels

BiggBoss: 'టికెట్ టు ఫినాలే' టాస్క్ స్టార్ట్... ఇనయా- శ్రీహాన్‌ల రొమాన్స్, శ్రీసత్యకు కాలినట్లుందే..!!

Wednesday, November 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్, ప్రేక్షకులు ఊహించడానికి కూడా వీలు లేని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 21 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 8 మంది మిగిలారు. వీరందరి కోసం టికెట్ టు ఫినాలే టాస్క్‌ని తీసుకొచ్చాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్లు ఎలిమినేట్ కాకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. అంతేకాకుండా ఫైనల్‌కి చేరుకునే తొలి వ్యక్తి అవుతారు.

దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ‘‘స్నో మెన్ ’’ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. అంటే కంటెస్టెంట్స్ మంచుతో ఓ బొమ్మను తయారు చేయాలి. ఇందుకోసం అవసరమైన ముక్కలను పై నుంచి పడుతూ వుండగా.. వాటిని దక్కించుకుని స్నోమెన్‌ను సిద్ధం చేయాలి. అందరికంటే ఫస్ట్ ఎవరైతే దీనిని తయారు చేస్తారో వారే విజేత. ఈ గేమ్‌కి రేవంత్‌ను సంచాలక్‌కి నియమించాడు బిగ్‌బాస్. ఫైనల్‌లో ఎలాగైనా అడుగుపెట్టాలనే కసితో ఇంటి సభ్యులు మంచు ముక్కల కోసం హోరాహోరీగా తలపెడ్డారు.

ఎంత ప్రయత్నించినా మంచు ముక్కలు దొరకకపోవడంతో ఇనయా నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించింది ఫైమా. కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఇనయా. మరోవైపు స్నో మెన్ చేయి పార్ట్ విరిగిపోవడంతో దానిని అతికించి పెట్టింది శ్రీసత్య. అలా చేస్తే కౌంట్ రాదని సంచాలక్‌గా వున్న రేవంత్ చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. అంతేకాదు.. తన దగ్గరున్న స్నో మెన్ చెయ్యి ఎవరికైనా కావాలా అని అడిగింది. దీనికి కూడా రేవంత్ అడ్డుపడటంతో శ్రీసత్య అగ్గిమీద గుగ్గిలమైంది.

ఇకపోతే.. ఈరోజు హైలైట్‌గా నిలిచిన సన్నివేశం ఒకటుంది. బిగ్‌బాస్ ప్రారంభమైన నాటి నుంచి శ్రీసత్యతో ఎంతో క్లోజ్‌గా వున్న శ్రీహాన్.. ఇనయాతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో అంతా షాక్‌కు గురయ్యారు. స్నోమెన్ గేమ్ కోసం బజర్ మోగగానే ఇనయా.. శ్రీహాన్ దగ్గర వున్న స్నోమెన్ పార్ట్స్‌ని లాక్కోవడానికి ప్రయత్నించింది. అయితే ఇనయా ఆమెను అడ్డుకోవడానికి బదులు దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసే వాళ్లకు రొమాన్స్‌లా వుంది తప్పించి.. ఫైటింగ్‌లా అనిపించదు. ఇది చూసిన శ్రీసత్య, మిగిలిన కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే శ్రీసత్య తేరుకుని మీరద్దరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దానికి ఇనయా మాట్లాడుతూ... ఏముంది ఎటాక్ చేశానని చెప్పింది. అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి అంటూ శ్రీసత్య పంచ్ ఇచ్చింది. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా.. ఇనయా- శ్రీహాన్‌లు క్లోజ్ అవ్వడాన్ని శ్రీసత్య జీర్ణించుకోలేకపోతోంది.

తర్వాత రేవంత్, ఫైమాలు... శ్రీహాన్- ఇనయాలు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించడంతో నవ్వులు పూశాయి. గట్టిగా లాగితే ఆ అమ్మాయి వచ్చేస్తుంది.. కానీ అలా లాక్కుండా అలాగే పట్టుకుంది’’ అంటూ శ్రీసత్య కూడా పంచ్ ఇచ్చేసింది. మొత్తం మీద వారిద్దరూ రొమాన్స్‌కి పాపకు బాగానే కాలినట్లుగా వుంది. ఇప్పటికి జరిగింది చాలదన్నట్లుగా శ్రీహాన్ వెళ్లి.. ఇనయాని పట్టుకోగానే షాక్ కొట్టినట్లు రియాక్షన్ ఇచ్చాడు. అది చూసిన శ్రీసత్య... నిన్న ఐటెం డ్యాన్సర్ అని, ఇప్పుడు మిత్రవింద అంటున్నాడని కామెంట్ చేసింది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి ఫైనల్‌లో ఫస్ట్ ఎవరు అడుగుపెడతారో చూడాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.