Tillu Square:ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'టిల్లు స్క్వేర్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Friday,April 19 2024]

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మార్చి 29న విడుద‌లై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మూవీలో సిద్ధు కామెడీ టైమింగ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వరన్ బోల్డ్ ప‌ర్ఫార్మెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. దీంతో తొలి రోజు నుంచి మంచి వ‌సూళ్లు రాబడుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

ఓవైపు థియేటర్లలో సందడి చేస్తున్న టిల్లుగాడు డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోనూ సందడి చేసేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హిస్టరీ రిపీట్ అవ్వడం నార్మల్‌. అదే టిల్లు వ‌స్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్‌ అవుతాయ్‌. అట్లుంట‌ది టిల్లుతోని అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రక‌టించింది. థియేట‌ర్లలో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి రావ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను సిద్ధు కట్టిపడేశాడు. అలాగే డీజే టిల్లులో నటించిన రాధిక పాత్ర మళ్లీ ఎంటర్ అవ్వడం కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక అనుపమ-సిద్ధు లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయారు. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌.. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఇచ్చిన మ్యూజిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2022లో వచ్చిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్స్ నిర్మించాయి.

ఇక ఈ సినిమాలో మురళీశర్మ, మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. మరోసారి టిల్లు క్యూబ్‌తో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నట్టు ఎండింగ్‌లో తెలిపి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు. మరి ఓటీటీలోనూ టిల్లుగాడి హవా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

More News

Gaami:100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో జీ5లో దూసుకెళ్తోన్న ‘గామి’

ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాన్ స్టాప్‌గా అందించటంలో ఎప్పుడూ ముందుండే వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5.

FirstPolling:దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాలతో

CM Jagan:సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

సీఎం జగన్(Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

Nominations:తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కీలక నేతల నామినేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు..

Viveka:వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు.. ఆ నేతలకు భారీ షాక్..

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.  అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.