రూ.100కోట్లకు చేరువలో.. 'టిల్లు స్క్వేర్' వసూళ్ల సునామీ..

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్‌బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. మరోసారి టిల్లు గాడి మ్యాజిక్ దెబ్బకు థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాడు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. తొలిరోజే రూ.23.7కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. తాజాగా అయిదు రోజుల్లో కలిపి రూ.85కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

దీంతో త్వరలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు. మరోవైపు అమెరికాలో కూడా టిల్లు స్క్వేర్ మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ డాలర్స్‌ పైగా వసూలు చేసింది. రూ.28 కోట్లు బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా షేర్ సాధించి భారీ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మించిన 'టిల్లు స్క్వేర్' సినిమా 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్‌తో అదరగొట్టగా.. టిల్లు పాత్రలో సిద్ధు చెప్పిన ఒన్ లైనర్స్, రిఫరెన్స్‌లు థియేటర్లో గట్టిగా పేలాయి.

తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అలాగే డీజే టిల్లులో నటించిన రాధిక పాత్ర మళ్లీ ఎంటర్ అవ్వడం కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక అనుపమ-సిద్ధు లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయారు. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌.. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఇచ్చిన మ్యూజిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ సమ్మర్‌లో అదిరిపోయే హిట్‌తో టిల్లు గాడు థియేటర్లను షేక్ చేస్తు్న్నాడు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ దక్కించుకుంది.

More News

KTR: హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టిపెట్టడం కాదు..

Telangana Congress: చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

అతివృష్టి అనావృష్టి ఉండకూడదు అంటారు. ఏదైనా మోతాదుకు మించి ఉండకూడదని దీని అర్థం. ఇదే సామెత ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుకోవడానికి పొలం బాట పట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి