close
Choose your channels

తాత పేరే టైటిల్‌గా?

Monday, February 10, 2020 • తెలుగు Comments

తాత పేరే టైటిల్‌గా?

ప్ర‌స్తుతం `ల‌వ్‌స్టోరీ` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న నాగ‌చైత‌న్య త‌దుప‌రి ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై గోపి ఆచంట‌, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీత గోవిందం త‌ర్వాత పరుశురామ్ డైరెక్ట్ చేయ‌బోతున్న చిత్రం కూడా ఇదే. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ పెట్టాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. ఇంత‌కు ముందు అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు కలిసి నటించిన  చిత్రం `మనం`. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర పేరు నాగేశ్వరరావు. అంతా ఓకే అయితే మరోసారి నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నాడట.

నిజానికి ప‌రుశురామ్ గీత‌గోవిందం తర్వాత మెగా క్యాంప్‌లోనే సినిమా చేయాల్సి ఉంది. ఆ స‌మ‌యంలో అర‌వింద్ మెగా హీరోల‌తో పాటు మ‌హేశ్‌బాబును కూడా ట్రాక్‌లోకి తెచ్చాడు. కానీ..ఎందుక‌నో ప‌రుశురామ్ క‌థ‌ను న‌చ్చ‌లేదో మ‌రేదైనా కార‌ణ‌మో ఏమో కానీ.. ప‌రుశురామ్ సినిమాను ట్రాక్ ఎక్కించ‌లేక‌పోయాడు. చాలా కాలం ఎదురుచూసిన త‌ర్వాత ప‌రుశురామ్ క‌థ‌ను చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. మ‌రి ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz