పూరి నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే..!

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ క‌ళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం స్పెయిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ నెలాఖ‌రుకు స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసి సెప్టెంబర్ 29న ఇజం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పూరి జ‌గ‌న్నాథ్ ఇజం త‌ర్వాత యువ హీరో నాగ శౌర్య‌తో సినిమా చేయ‌నున్నారు.

డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి స్ర్కిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తయ్యింది. సెప్టెంబ‌ర్ నుంచి ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే...ఫిల్మ్ ఛాంబ‌ర్ లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ పై రొమాంటిక్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసారు. ఈ టైటిల్ నాగ శౌర్య మూవీ కోస‌మే అని స‌మాచారం. మ‌రి...రొమాంటిక్ అనే టైటిల్ తో నాగ శౌర్య‌ను పూరి ఎలా చూపిస్తాడో చూడాలి.

More News

నాని - కీర్తి సురేష్ జంట‌గా నేను లోక‌ల్ ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది.

గుంటూరు టాకీస్ కు సీక్వెల్

బుల్లి తెర యాంక‌ర్ రేష్మి హీరోయిన్ గా, సిద్దు హీరోగా, సీనియ‌ర్ న‌రేష్‌ కీల‌క పాత్ర‌లో ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు టాకీస్ సినిమా రూపొందిన‌ విష‌యం తెలిసిందే.

'శ్రీరస్తు శుభమస్తు' శాటిలైట్ హక్కులు...

అల్లు శిరీష్,లావణ్య త్రిపాఠి జంటగా పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

'నాగభరణం' ఆడియో రిలీజ్ డేట్.....

రమ్యశ్రీ టైటిల్ పాత్రలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాగభరణం'.

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు..!

కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు...ఇంతకీ ఆ కొత్త సినిమా ఏమిటి అనుకుంటున్నారా..?