శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

  • IndiaGlitz, [Monday,June 05 2023]

టాలీవుడ్‌లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం, క్రైమ్ ఇలా అన్ని జోనర్‌లలో నటించిన అరుదైన నటుల్లో ఒకరిగా శ్రీకాంత్ ఘనత వహంచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ తెలుగులో ఈ తరం నటుల్లో 100 సినిమాలు పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, కన్యాదానం, మా నాన్నకి పెళ్లి, ప్రయేసి రావి, పెళ్లి సందడి, ఖడ్గం వంటి సినిమాలు ఆయన నటనకు తార్కాణం. కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుని నేటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు శ్రీకాంత్.

నట వారసుడిగా రోషన్‌ను పరిచయం చేసిన శ్రీకాంత్ :

తన కో స్టార్ ఊహను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు శ్రీకాంత్. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారు రోషన్‌, మేధ, రోహన్. పెద్దబ్బాయి రోషన్‌ను తన నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయం చేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు రోషన్. త్వరలో మరిన్ని సినిమాల్లో ఆయన నటించనున్నారు.

ఫ్యామిలీ ఫంక్షన్‌లో తళుక్కుమన్న మేధ:

అమ్మాయి మేథ ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకుంటోంది. త్వరలోనే ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని ఫిలింనగర్ ‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైట్ స్కిన్ టోన్‌తో పాలరాతి శిల్పంలా వుంది మేధ. ఇప్పుడొచ్చే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈమె సొంతం. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో శ్రీకాంత్ కుటుంబం మొత్తం సందడి చేసింది. వీరిలో మేధ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గోల్డ్ కలర్ చీరలో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది మేధ. మరి శ్రీకాంత్ ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా లేక మరిన్ని ఉన్నత చదువులు చదివిస్తారా అన్నది తెలియాల్సి వుంది. 

More News

Shaitan Trailer: 'సైతాన్' ట్రైలర్ : వామ్మో.. నెక్ట్స్ లెవల్‌లో క్రైమ్ సీన్లు, బూతులు, బోల్డ్ కంటెంట్

డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ అభిరుచి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ. ఆనందో బ్రహ్మా వంటి కామెడీ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్న ఆయన తర్వాత ఎవరు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక మరియు మెమోరియల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు,

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ వెనుక జనసేనాని.. వ్యూహాల్లో పవన్ నిపుణుడు కాక ఇంకేంటి , విశ్లేషకుల మాట ఇదే

ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఆయన

Nadendla Manohar: హెలికాఫ్టర్‌లో వెళ్లడమే .. జనం గోడు పట్టదు: జగన్‌ పాలనపై నాదెండ్ల విమర్శలు

పదవీ కాలం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు మిగిలాయి? ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నాం అని ఆలోచించే వారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తోందన్నారు

Train Derailment: ఒడిషాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్

గత శుక్రవారం ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.