close
Choose your channels

హీరోలూ జీరోలవకండి.. కాస్త ఊపిరి అందించండి..

Saturday, May 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం భారతదేశం ఎంత ప్రమాద స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసిన శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. శ్మశానాలు సైతం హౌజ్‌ఫుల్ బోర్డులు పెట్టేసుకుంటున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సెకండ్ వేవ్ ఇంతటి దారుణమైన ఫలితాలను ఇస్తుందని ఎవరకూ ఊహించలేదు. ఇంతటి దారునమైన స్థితిలో దేశం ఉంటే.. ఇదే అదనుగా ప్రజల నుంచి అందినకాడికి దోచేసేవారు కొందరైతే.. మాస్క్ పెట్టుకోండి.. శానిటైజర్ వాడండని చెప్పి చేతులు దులుపుకునేవారు కొందరు.

Also Read: వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌ కిషన్ చిత్రం

మాస్క్ పెట్టుకోండి.. శానిటైజర్ వాడండని చెప్పే వారిలో ప్రథమ స్థానంలో మన సెలబ్రిటీలు ఉన్నారు. సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్.. ప్రాంతీయ భేదం లేకుండా సేవ చేస్తుంటే సాయమందించిన మనవాళ్లు మాత్రం జాగ్రత్తలు చెప్పేసి ఊరుకుంటున్నారు. కనీసం తమ వంతు బాధ్యతగా ప్రజల పక్షాన నిలిచి ఆక్సిజన్ సమకూర్చమనో లేదంటే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనో కోరిన పాపాన పోవడం లేదు. ప్రజానీకానికి మాత్రం సలహాలిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరిగింది. మాస్క్ పెట్టుకోమనో.. శానిటైజర్ వాడమనో ఇప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరమైతే లేదు. కానీ మన సెలబ్రిటీలు మాత్రం చాలా గొప్పగా పబ్లిక్‌కు సలహాలిచ్చేస్తున్నారు.

సెలబ్రిటీల తీరుపై పబ్లిక్ సైతం మండిపడుతున్నారు. హీరోలు జీరోలవ్వొద్దని తిరిగి సలహా ఇవ్వడం ప్రారంభించారు. సెలబ్రిటీలంతా ఒక లక్ష రూపాయల చొప్పున కేటాయించిన కొన్ని వేల మందికి ఊపిరి అందించవచ్చని అంటున్నారు. మేము మీ సినిమాలు చూడబట్టే మీరు అంత పెద్ద హీరోలయ్యారు.. కోట్ల అధిపతులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి రోజుల్లో మీ సినిమాలు విడుదలైనా చూడాలంటే మేము బతికుండాలి కదా అని వాపోతున్నారు. సోనూసూద్‌లా కాస్తైనా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మీ హీరోలు జీరోలవకుండా చూసుకోండంటూ హీరోల అభిమానులకు సైతం సలహాలిస్తున్నారు. సామాన్యులకు కాస్త ఊపిరి అందించాలని అర్థిస్తున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో కాస్తో కూస్తో సాయమందించిన హీరోలు.. సెకండ్ వేవ్ ఇంత దారుణమైన ఫలితాలిస్తున్న సమయంలో కాస్తైనా స్పందించాలని కోరుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.