close
Choose your channels

ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండించిన టాలీవుడ్

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండించిన టాలీవుడ్

జమ్ముకశ్మీర్‌‌‌‌లోని పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం సుమారు 42మంది అమరులయ్యారని తెలుస్తోంది. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనని చెబుతూ ఆర్మీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ శాఖ నుంచి.. ‘రంగంలోకి దిగి.. ఉగ్రమూకల తాట తీయండి’ అనే ఒకే ఒక్క మాట కోసం జవాన్లు వేయికళ్లతో వేచిచూస్తున్నారు!. ఈ ఘటన తీవ్ర బాధాకరమని.. ఉగ్రమూకల తీరును సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

మహేశ్ బాబు..
"పుల్వామాలో ఉగ్రవాద దాడులు జరిగినట్లు తెలుసుకుని చాలా బాధపడ్డాను. అమరులైన జవాన్లకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. అమరుల కుటుంబీకులకు మనోధైర్యంతో ఉండాలి" అని మహేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్
" పుల్వామా ఘటనలో ప్రాణాలను కోల్పోయిన 42 సీఆర్పీఎఫ్‌‌ జవాన్లు కుటుంబాలందరికీ నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను. మీ త్యాగాలు భారతీయులెవ్వరు మరువరు.. గుర్తుపెట్టుకునే ఉంటారు. నిజంగా ఈ ఘటన జరిగిన రోజు.. విచారకరమైన రోజు" అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

రానా దగ్గుబాటి
" మన సైనికులు 40మంది అమరులైనట్లు వచ్చిన వార్తను చూసి షాకయ్యాను. చాలా బాధాకరం. జవాన్ల కుటంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని హీరో రానా ట్విట్టర్ వేదికగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోస్ట్ చేశారు.

సూర్య
"పుల్వామాలో దాడులు జరగడం చాలా బాధాకరం.. ఇది హృదయవిదారక ఘటన. ఉగ్రమూకల దాడిలో అమరులైన కుటుంబీకులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. కుమారుడు, సోదరుడు, భర్త లేదా తండ్రిని కోల్పోయిన అమరుల కుటుంబీకులు నా హృదయపూర్వక సంతాపం" అని ట్విట్టర్ వేదికగా హీరో సూర్య తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

నాని..
"జమ్ముకశ్మీర్‌‌లో జరిగిన దాడి ఘటన గురించి తెలుసుకుని షాకయ్యాను. నిజంగా ఇది హృదయవిదారక ఘటన.. తీవ్ర ఆగ్రహం తెప్పించే ఘటన. ప్రేమికుల రోజున నిజజీవితంలో హీరోలను కోల్పోయాం. నా ఆలోచనలు, ప్రార్థనలు అమరులైన జవాన్ల కుటుంబాలతో ఉంటాయి" అని నాని ట్వీట్ చేశారు.

వరుణ్ తేజ్..
"పుల్వామా దాడిలో ప్రియమైన వారిని కోల్పోయాం. అమరుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను" అని మెగా హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

నిఖిల్..
"దేశం కోసం పోరాడుతున్న జవాన్లపై దాడి చేశారని తెలుసుకుని చలించిపోయాను. 40 మంది సైనికులు అమరులుకావడం బాధాకరం. ఈ ఘటన గురించి తెలుసుకుని రాత్రంతా నేను నిద్రపోలేదు.. ఆ దాడి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను" అని టాలీవుడ్ హీరో నిఖిల్ రెండు ట్వీట్లు చేశారు.

అల్లు శిరీష్ 
" పుల్వామా ఘటన హృదయ విదారకమైనది. దాడికి సంబంధించిన వీడియోలు చూసి చలించిపోయాను. ధైర్యమున్నోళ్లు ఫేస్‌‌ టూ ఫేస్ ఎదుర్కొంటారు.. దొంగలే ఇలా చాటుగా వచ్చి దాడిచేశారు. అమరులైన కుటుంబాలకు ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను"అని మెగా హీరో అల్లు శిరీశ్ చెప్పుకొచ్చారు.

అల్లరి నరేష్ 
"తమ జీవితాలను త్యాగం చేసిన అమరవీరులారా దేశం మీకు రుణపడి ఉంది. మీ కుటుంబాలకు దేశం రుణపడి ఉంటుంది" అని అల్లరి నరేశ్ ట్వీట్ చేశారు.

కొరటాల శివ 
"పుల్వామా దాడికి సంబంధించిన వార్తలను వినడం బాధాకరం. అమరుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. భారతదేశం మాత్రమే కాదు.. ఈ దుర్మార్గపు తీవ్రవాద చర్యలను పరిష్కరించడానికి ప్రపంచం ఒక్కటవ్వాలి" అని ఆయన ఆకాంక్షించారు.

పూరీ జగన్నాథ్
ఈ దాడి ఘటన విన్నప్పుడు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన ఎంతైనా ఉందని అని నేను భావిస్తున్నాను"అని దాడికి సంబంధించిన ఘటన వీడియోను పూరీ షేర్ చేశారు.

అనిల్ రావిపూడి..
"ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మ శాంతి చేకూరాలి. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.

రకుల్ ప్రీత్..
"పుల్వామాలో భారత జవాన్లపై దాడి భయంకరమైనది. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను" అని నటి రకుల్ ట్వీట్ చేసింది.

అనుష్కశర్మ..
" ఈ వార్త చదివి నేను చాలా బాధపడ్డాను. అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను"అని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.

రాశీ ఖన్నా
"పుల్వామా దాడి వినాశకరమైన.. హృదయ విదారకమైనది. మన జవాన్లు అమరులవ్వడం బాధాకరం. అమరులైన జవాన్ల కుటుంబాలకు.. వారి ప్రియమైనవారికి హృదయపూర్వకంగా సంతాపం తెలుపుతున్నాను"అని రాశీఖన్నా ట్వీట్ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.