సూర్య సినిమాలో బాలీవుడ్ భామ‌..

  • IndiaGlitz, [Thursday,January 07 2016]

త‌మిళ హీరో సూర్య విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో 24, హ‌రి డైరెక్ష‌న్ లో సింగం 3 సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...డైరెక్ష‌న్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్ధ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

తివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం నితిన్ తో అ..ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జ‌న‌వ‌రికి షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. అ...ఆ రిలీజ్ త‌ర్వాత నుంచి త్రివిక్ర‌మ్ సూర్య సినిమా వ‌ర్క్ స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ సినిమా హీరోయిన్ విష‌యంలో బాలీవుడ్ భామ దీపికా ప‌డుకునే న‌టిస్తే...ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీపికాను సంప్ర‌దిస్తార‌ట‌. మ‌రి..దీపికా ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

చైతు ప్రేమ‌మ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

అభిమానికి అన్యాయం జ‌రిగితే నో లాజిక్స్ అంటున్న‌ రామ్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నేను...శైల‌జ సినిమా గురించి ట్విట్ట‌ర్ లో...ఒక న్యూస్ ఛాన‌ల్ లో త‌ప్ప వ‌ర‌ల్డ్ వైడ్ నేను...శైల‌జ సినిమా చాలా బాగా ర‌న్ అవుతుంది.

ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్న త‌రుణ్‌

లవర్ బాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చె పేరు తరుణ్ . ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నా రియ‌ల్ లైఫ్ లో ఆ...ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌లిసున్న వ్య‌క్తినే కోరుకుంటా - హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నక‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి. ఆత‌ర్వాత దూసుకెళ్తా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రాల్లో న‌టించిన లావ‌ణ్య‌.

'చంద్రకళ' సీక్వెల్ హక్కులు దక్కించుకున్న సర్వంత్రామ్‌ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా... తెలుగులో చంద్రకళగా ఆ మధ్య విడుదలై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే.