ఏపీ వరదలు: ఎట్టకేలకు కదిలిన టాలీవుడ్.. తలో రూ.25 లక్షలు ప్రకటించిన ఎన్టీఆర్, చిరంజీవి, మహేశ్, చెర్రీ

వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ కొద్దిరోజుల క్రితం చివురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించి తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది.

జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. రాష్ట్రంలో వరద బాధితుల కడగండ్లు తన మనసును కలచివేసిందని అన్నారు. అందుకే వారికి సాయంగా తన వంతుగా కొద్దిమొత్తం విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఆ వెంటనే మహేశ్ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌లు సైతం తలో రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు వారంతా వేరు వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేశారు.

వీరి స్పూర్తితో టాలీవుడ్ నుంచి మరికొందరు ప్రముఖులు .. వరద బాధితులకు అండగా నిలిచే అవకాశం వుంది. ఈ వరదకు సంబంధించి చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదట స్పందించింది అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ సంస్థే. నవంబర్ 24న ఈ సంస్థ తిరుపతిలో వరద బాధితులకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించింది. అయితే ఆలస్యంగానైనా మిగిలినవారు స్పందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More News

కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్... హెల్త్ బులెటిన్ విడుదల

కరోనా వైరస్ బారినపడిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కోలుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

బిగ్‌బాస్ 5 తెలుగులో మరోసారి  నామినేషన్ల వల్ల రచ్చ లేచింది. సోమవారం నాటి నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యులు డిస్కషన్ చేసుకున్నారు.

'గేమ్ ఆన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో

‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది : హీరో స‌త్య‌దేవ్‌

వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో