Naga Shaurya: కన్నడ అమ్మాయితో నాగశౌర్య పెళ్లి.. పదిరోజుల్లోనే ముహూర్తం, వెడ్డింగ్ కార్డ్ వైరల్

  • IndiaGlitz, [Thursday,November 10 2022]

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన నాగశౌర్య ఓ ఇంటి వాడు కాబోతున్నారు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే ఇంటీరియర్ డిజైనర్‌తో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11.25 గంటలకు వీరి విహహం జరగనుంది. 19వ తేదీన మెహందీ వేడుకతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. మెహంది, పెళ్లికి వేర్వేరుగా డ్రెస్ కోడ్ పెట్టినట్టు ఇన్విటేషన్ కార్డు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం నాగశౌర్య శుభలేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగశౌర్యకు ఫ్యాన్స్ విషెస్:

బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేదంటే ప్రేమ వివాహమా అన్నది మాత్రం తెలియరాలేదు. తమ అభిమాన హీరో ఓ ఇంటి వాడు కాబోతుండటంతో నాగశౌర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వరుస హిట్లతో స్టార్ రేసులోకి :

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన నాగశౌర్య తర్వాత విజయవాడలో పెరిగారు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసి ప్రయత్నాలు ప్రారంభించారు. అలా క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అయితే ‘‘చందమామ కథలు’’ అనే సినిమా నాగశౌర్యకు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదు గాడు ఇలా వరుస హిట్లతో స్టార్ రేసులోకి దూసుకొచ్చారు. కానీ చలో డిజాస్టర్ కావడంతో పాటు తర్వాత చేసిన కణం, కృష్ణ బృందా విహారిలు నిరాశపరిచాయి. అయినప్పటికీ దిగులు చెందక ఇటీవలే తన 24వ సినిమాను పట్టాలెక్కించారు.

More News

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ ముఖ్య పాత్ర లో సహస్ర ఎంటటైన్మెంట్స్ సినిమా ప్రారంభం

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.

‘హిట్ 2’ నుంచి మెలోడి రొమాంటిక్ వీడియో సాంగ్ ‘ఉరికే ఉరికే' విడుద‌ల

వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ..త‌న‌దైన క్రేజ్‌, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్‌.

Nenu Student Sir : 'నేను స్టూడెంట్ సార్' టీజర్ నవంబర్ 12న విడుదల

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ''నేను స్టూడెంట్ సార్!'. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో

రేవంత్‌ను రెచ్చగొట్టేందుకు ప్లాన్లు... ఇనయాకు మళ్లీ నిరాశే

బిగ్‌బాస్ 6 తెలుగులో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

JaganannaMosam : 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు'... వైసీపీ పాలనపై జనసేన మరో పోరాటం

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న జగనన్న కాలనీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.