close
Choose your channels

హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత‌... షాకిచ్చిన హీరోయిన్‌?

Friday, February 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత‌... షాకిచ్చిన హీరోయిన్‌?

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా వ‌ర‌కు స‌మ‌న్వ‌యంతో పనులు జ‌రుగుతుంటాయి. ఎవ‌రినీ ఎవ‌రూ ఇబ్బంది పెట్టాల‌ని చూసిన ఎక్క‌డో ఓ చోట దెబ్బ త‌గిలేస్తుంది. ఇప్పుడు ఓ నిర్మాత ప‌రిస్థితి అలాగే త‌యారైంద‌ని సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. మెహ్రీన్‌. ఈ ఏడాది ఈ అమ్మ‌డు న‌టించిన చిత్రాల్లో ఎంత మంచివాడ‌వురా.. అశ్వ‌థ్థామ చిత్రాలు విడుద‌ల‌య్యాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. స‌రే జ‌యాప‌జ‌యాలను ప‌క్క‌న పెడితే అశ్వ‌థ్థామ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోషన్స్ విష‌యంలో నిర్మాత‌ల్లో ఒక‌రైన శంక‌ర్ ప్ర‌సాద్‌కి, హీరోయిన్ మెహ్రీన్‌కి మ‌న‌స్ప‌ర్ధ‌లు ఏర్పడ్డాయ‌ట‌.

హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టిన నిర్మాత‌... షాకిచ్చిన హీరోయిన్‌?

అస‌లు విష‌య‌మేమంటే.. ప్ర‌మోష‌న్స్‌లో ఓ ప్రోగ్రామ్‌కి రాఘవేంద్ర‌రావు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో హీరోయిన్‌కి అల‌ర్జీ రావ‌డంతో ఆమె ప్రోగ్రామ్‌కి రాలేన‌ని చెప్పింది. నిర్మాత‌కు డాక్ట‌ర్ ప్రిస్కిప్ష‌న్ కూడా చూపించింది. అయితే శంక‌ర్ ప్ర‌సాద్ ఆమె మాట‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ట‌. ప్రోగ్రామ్‌కి రాక‌పోతే హోట‌ల్ బిల్స్ పే చేయ‌న‌ని ఖ‌రాకండీగా చెప్పేశాడ‌ట‌. దాంతో మెహ్రీన్ హ‌ర్ట్ అయ్యింది. దాంతో చెప్ప పెట్ట‌కుండా హోటల్ ఖాలీ చేసి వెళ్లిపోయింది. స‌ద‌రు హోట‌ల్ వారు నిర్మాత‌కు ఫోన్ చేసి మెహ్రీన్ వెళ్లిపోయింద‌ని, కాబ‌ట్టి మీరే బిల్లు క‌ట్టాల‌ని చెప్ప‌డంతో శంక‌ర్ ప్ర‌సాద్ త‌ప్ప‌క బిల్ పే చేశాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి దీనిపై నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.