close
Choose your channels

'అ!' సీక్వెల్‌లో టాప్ స్టార్స్

Saturday, August 17, 2019 • తెలుగు Comments

అ! సీక్వెల్‌లో టాప్ స్టార్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాతగా మారి రూపొందిన చిత్రం `అ!`. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని అందుకుంది. రీసెంట్‌గా బెస్ట్ స్క్రీన్ ప్లే గా జాతీయ అవార్డు కూడా ఈ చిత్రానికి దక్కింది. కాగా.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

`అ!` చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, సీక్వెల్‌లో కూడా నటిస్తుంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం వైవిధ్యమైన కథాచిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఇందులో నటించబోతున్నాడట. ప్రస్తుతం తమిళంలోనే కాకుండా తెలుగు చిత్రాల్లోనూ నటించడానికి విజయ్ సేతుపతి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి `సైరా నరసింహారెడ్డి`, వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు.

Get Breaking News Alerts From IndiaGlitz