టాప్ టెక్నిషియన్స్ ప్రశంసలు పొందుతున్న 'రాజరథం'

  • IndiaGlitz, [Tuesday,February 27 2018]

ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి 'టాక్ అఫ్ ది టౌన్' గా ఉన్న 'రాజరథం' గురించి పరిచయం అక్కర్లేదు. అనేక అంశాలతో ఆకట్టుకుంటున్న 'రాజరథం', ఇప్పుడు ఆ చిత్రానికి పని చేస్తున్న టెక్నిషియన్స్ గురించే ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుకోవడం విశేషం. ఈ చిత్రానికి 'సౌండ్' విభాగాన్ని పర్యవేక్షిస్తున్న రాజా కృష్ణన్ దేశంలోనే పేరొందిన టాప్ సౌండ్ మిక్సర్స్ లో ఒకరు.

'ప్రేమమ్', 'బెంగుళూరు డేస్','విక్రమ్ వేద','అర్జున్ రెడ్డి','అ..ఆ..', 'నా పేరు సూర్య' వంటి చిత్రాలకి ఈయన పని చేశారు. ఆయన 'రాజరథం' కి మిక్సింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడు అనూప్ చిత్రాన్ని సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దిన విధానం చూసి రాజా కృష్ణన్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఆయనే ఈ చిత్రానికి 'డాల్బీ అట్మాస్' అవసరం అని, దాని వల్ల ప్రేక్షకులకి మరింత అనుభూతి ని అందిచగలమని టీం ని ప్రోత్సహించారు. ఈ చిత్రానికి సంబందించిన 'సౌండ్' విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుని చేస్తున్నారు. " ఈ సినిమా నా కెరీర్ లో నే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ప్రేక్షకులు సినిమా చూశాక సౌండ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు" అన్నారు.

'బాహుబలి', 'ఈగ', 'దృశ్యం', 'రంగితరంగా' వంటి చిత్రాలకి పని చేసిన 'కలరిస్ట్' శివ కుమార్ 'రాజరథం' కి పని చేయడం ఒక గొప్ప అనుభవం గా చెప్తున్నారు. దర్శకుడు అనూప్ తో ఎన్నో చర్చలు, ఎంతో సమయం గడిపిన శివ కుమార్ స్క్రిప్ట్ కి తగ్గట్టు ఆకట్టుకునే కలర్ పాల్లేట్స్ ని ఈ సినిమా కోసం వాడారు. 'రాజరథం' విడుదల అయ్యాక ఈ కలర్ పాల్లేట్స్ ని మరిన్ని సినిమాల్లో చూస్తారని అన్నారాయన.

నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవిశంకర్, రానా దగ్గుబాటి వాయిస్ తో ఉన్న 'రాజరథం' ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతోంది. 'రాజరథం' తో దర్శకుడు అనూప్ భండారి మరో సారి తెర మీద తన మేజిక్ చూపించబోతున్నారు. నిర్మాణంలో తమ తొలి ప్రయత్నం గా 'జాలీ హిట్స్' నిర్మించిన 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల కాబోతోంది.

More News

ప‌వ‌న్ క‌థ‌.. నాని చెంత‌కు?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. యువ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్‌కు ఒక సినిమా బాకీ ఉన్నారు. అంతేగాకుండా.. మైత్రీమూవీ మేక‌ర్స్ ఇచ్చిన అడ్వాన్సు కూడా ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉండ‌డం, సంతోష్ శ్రీనివాస్ కూడా మైత్రీమూవీ మేక‌ర్స్‌కు అందుబాటులో ఉండ‌డంతో ప‌వ‌న్ ఆ సినిమా చేస్తార‌నే అంద‌రూ అనుకున్నారు.

నానికి జోడీగా ర‌వితేజ హీరోయిన్‌?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మిస్తున్న‌ విషయం తెలిసిందే.  నాని పుట్టినరోజు సందర్భంగా.. ఇటీవ‌లే  మహతి స్టూడియోలో చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ సార‌థ్యంలో పాటల రికార్డింగ్‌ను  ప్రారంభించారు.  కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నా

చిత్రీకరణ తుదిదశ లో విజయ్ దేవరకొండ చిత్రం

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గీతా గోవిందం'(ప్రచారంలోనున్న పేరు).

మార్చి 5 నుంచి 'సైరా నరసింహారెడ్డి' షెడ్యూల్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.

నాగ్ , వర్మ చిత్రం టైటిల్ అదేనా?

కింగ్ నాగార్జున,సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే.