ఏపీలో పర్యాటకం నెక్ట్స్ లెవెల్: కందుల దుర్గేష్


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంటుందని అన్నారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. వెలగపూడి సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని వెల్లడించిన మంత్రి.. సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అదే విధంగా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని కూడా కేంద్ర మంత్రికి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయని వివరించిన మంత్రి కందుల దుర్గేష్.. స్వదేశ్ దర్శన్ 2.0 కింద బొర్రా గుహలు, లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని.. స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను త్వరతితగతిన ఆమోదించమని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు మంత్రి దుర్గేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com