close
Choose your channels

ర‌జ‌నీకాంత్ చిత్రంలో ట్రాన్స్ జెండ‌ర్‌

Tuesday, June 25, 2019 • తెలుగు Comments

ర‌జ‌నీకాంత్ చిత్రంలో ట్రాన్స్ జెండ‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్‌తో జీవా అనే ట్రాన్స్ జెండ‌ర్ క‌లిసి న‌టిస్తున్నారు. ర‌జ‌నీ, జీవా మ‌ధ్య కీల‌క సన్నివేశాల చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

ర‌జనీకాంత్ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, సునీల్ శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz