close
Choose your channels

మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ సిద్ద‌మ‌వుతోందా..!

Thursday, January 21, 2021 • తెలుగు Comments

మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ సిద్ద‌మ‌వుతోందా..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. గ‌ణతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి మెగాక్యాంప్ ప్లాన్ చేసింది. ఇందులో చిరంజీవి మాజీ నక్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. కాగా.. రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే పాత్ర‌లో క‌నిపిస్తాడు. కాగా ఈ పాత్ర న‌క్స‌లైట్ నాయ‌కుడు అని టాక్‌. మ‌రి ఆ పాత్ర‌ను కొర‌టాల శివ ఎలా ఎలివేట్ చేస్తాడోన‌నేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. దేవాదాయ‌శాఖ‌లోని అవినీతిని ప్ర‌శ్నించేలా కొర‌టాల శివ ‘ఆచార్య‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మే 9న ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా.. డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ‘లూసిఫ‌ర్‌’ రీమేక్ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించాడు. ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. దసరాకు ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

Get Breaking News Alerts From IndiaGlitz