స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డి.జె.దువ్వాడ జగన్నాథమ్' టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

  • IndiaGlitz, [Friday,February 24 2017]

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం డి.జె. దువ్వాడు జగన్నాథమ్'. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలై ట్రెమెండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఈ సంద‌ర్బంగా

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలుంటాయి. అలాంటిది ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా హ్యాట్రిక్ మూవీ ఇది. మా బ్యానర్లో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్య‌', 'బ‌న్ని', 'ఆర్య‌2', 'జులాయి', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' వంటి మ్యూజిల్ హిట్ మూవీస్ జోడి బన్ని, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు కూడా ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలుస్తుంది. ఇటు ప్రేక్షకులను, అటు మెగాభిమానులను అలరించేలా మా బ్యానర్ చాలా ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

More News

బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న బోయపాటి - బెల్లంకొండల చిత్రం!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది.

హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని...

విలక్షణ చిత్రాల కేరాఫ్ నేచురల్ స్టార్

శివరాత్రి సందర్భంగా 'గౌతమ్ నంద' కొత్త పోస్టర్ విడుదల!

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'.

మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న 'సినీ మహల్'

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్,రేయాన్ రాహుల్,తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సినీ మహల్'.

ఎన్టీఆర్ వచ్చే నెలలో జాయిన్ అవుతాడట...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం'జై లవకుశ'(రిజిష్టర్ అయిన టైటిల్).