​'త్రిపుర' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

స్వాతి టైటిల్ రోల్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన చిత్రం 'త్రిపుర'. తమిళ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'. జె. రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.

విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ బాగున్నాయి. అలాగే, ఓ ప్రముఖ టీవీ చానల్ భారీ ఆఫర్ ఇచ్చి, ఈ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో పెద్ద చిత్రాల శాటిలైట్స్ అంత సజావుగా పూర్తి కావడంలేదు. సినిమా విడుదలైన తర్వాత, ఆ చిత్రవిజయాన్ని బట్టి శాటిలైట్ హక్కులు తీసుకుంటున్నారు. అలాంటిది ఈ చిత్రం స్టోరీ లైన్, సినిమాకి వచ్చిన క్రేజ్ ని చూసి, శాటిలైట్ హక్కులను ఆ చానల్ దక్కించుకుంది.

ఈ చిత్రవిశేషాలను చినబాబు తెలియజేస్తూ - ''ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. మేం అనుకున్న విధంగా సినిమా బాగా వచ్చింది. స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని నిర్మించాలని ఉంది. ఇది యునివర్శల్ కథాంశంతో రూపొందిన చిత్రం కాబట్టి, ఏ భాషకైనా నప్పుతుంది'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''నా తొలి చిత్రం 'గీతాంజలి'కన్నా ఈ చిత్రం బాగా వచ్చింది. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. స్వామి రారా, కార్తికేయ విజయాల తర్వాత స్వాతి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో ఆమె హ్యాట్రిక్ సాధించడం ఖాయం. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి అందించిన సాహిత్యం ఓ హైలైట్. పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ ఎంటర్ టైనర్ ఇది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సంగీతం: కమ్రాన్, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్.

More News

'శ్రీమంతుడు' సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - 'శ్రీముంతుడు' యూనిట్

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది.

సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు

తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది.

రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

హాలీవుడ్ మూవీ ‘వారియర్’ సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘బ్రదర్స్’ ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది.

రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆ వార్తలను కొట్టి పారేసింది...

హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో