త్రిష , నయనతార కలిసి నటిస్తున్నారా?

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

తమిళ చిత్రసీమను తమ గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు నయనతార, త్రిషలు ఒకప్పుడు శత్రువుల్లా కీచులాడుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే సినిమా రంగంలో ఎవరూ శాశ్వత మిత్రులుండరు. అదేవిధంగా శాశ్వత శత్రువులుండరు. ఇదే విషయాన్ని వీరిద్దరూ మరోసారి రుజువు చేశారు. ప్రస్తుతం నయనతార, త్రిషలు మంచి స్నేహితులయ్యారు. రీసెంట్ గా నయనతార, విజయ్ సేతుపతి నటించిన నానుం రౌడీ దాన్' చిత్రం మంచి సక్సెస్ అందుకుంది.

ఈ చిత్రానికి నయనతార కొత్త ప్రేమికుడు విఘ్నేష్ శివ డైరెక్టర్. ఇప్పుడు మరోసారి తన లవర్ దర్శకత్వంలోనే నయనతార మరోసారి విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రలో త్రిషను చేయమని యూనిట్ సంప్రదిస్తే త్రిష కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యిందట. మొత్తం మీద అన్నీ అనుకున్నట్టు కుదిరితే నయనతార, త్రిష ఓకే సినిమాలో అభిమానులను అలరించబోతున్నారన్నమాట.

More News

నవంబర్ 6న రానున్న 'ఆదిత్య' (క్రియేటివ్ జీనియస్)

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.

బన్ని రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

‘ఎవడు’,‘రేసు గుర్రం’,‘సన్నాఫ్ సత్యమూర్తి’,‘రుద్రమదేవి’..ఇలా వరుసగా పాజిటివ్ రిజల్ట్స్ తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ స్టైలీష్ స్టార్..

సమంతకి త్రివిక్రమ్ అలాంటి ఛాన్సివ్వడా

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయికగా సమంతకి ప్రత్యేక స్థానం ఉంది.ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ''అత్తారింటికి దారేది'',''సన్నాఫ్ సత్యమూర్తి'' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత..

నాగచైతన్య సేమ్ ఫార్ములా

యువకథానాయకుడు నాగచైతన్య తన కెరీర్ లోనే తొలిసారిగా చేసిన రీమేక్ చిత్రం ''తడాఖా''.తమిళంలో మంచి విజయం సాధించిన ''వేట్టై''సినిమాకి తెలుగు వెర్షన్ ఇది.