చిరుకు నో చెప్పి.. రవితేజకు త్రిష గ్రీన్ సిగ్నల్!?

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

సీనియర్ నటి త్రిష తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నటించి చాలా రోజులైంది. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అప్పట్లో అందరూ ఆలస్యమైనా బంపరాఫర్ కొట్టేసిందని.. మరోసారి హిట్ జోడి వస్తోందని ఇలా రకరకాలు మాట్లాడేసుకున్నారు. అయితే ఏవేవో సాకులు చెప్పిన ఈ బ్యూటీ సినిమా చేయట్లేదని తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. అయితే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయంతో అటు మెగాభిమానులు, ఇటు టాలీవుడ్ సినీ ప్రియులు షాకవుతున్నారు.

కారణమేంటి..!?

ఇందుకు కారణం చిరుకు నో చెప్పి మాస్ మహారాజ్ రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇటీవల రవితేజ సినిమాలో నటించాలని దర్శకనిర్మాతలు సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్‌గా అడగ్గా.. ఆ బ్యూటీ ఒప్పేసుకుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త అటు నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. చిరు నో చెప్పడమేంటి..? రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి..? త్రిష ఎందుకిలా చేస్తోంది..? అని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారట. మరి దీనిపై చిత్రబృందం కానీ.. త్రిష కానీ క్లారిటీ ఇస్తే వ్యవహారం కొలిక్కి వస్తుంది.

More News

కెప్టెన్‌ విజయ్‌కాంత్ పెద్ద మనసు.. పవన్ అభినందన

కోలీవుడ్ సూపర్ స్టార్ ఓ వెలుగు వెలిగిన నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేసేందుకు

చెల్లెలికు సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లేఖ‌

విల‌క్ష‌ణ న‌ట‌న‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. త‌న ఫ్యామిలీతో ప్ర‌స్తుతం క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది

వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష..: కేంద్ర ప్రభుత్వం

కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులు, వారి బంధువులు

బాల‌య్య 106కు కొత్త చిక్కులు..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం

సరదా కోసం బయటికి రావడం మూర్ఖత్వం: కీరవాణి

లాక్‌డౌన్ సమయంలో సరదా కోసం కొందరు బయటికొస్తున్నారని.. నిజంగా అలా రావడం మూర్ఖత్వం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వ్యాఖ్యానించారు.