త్రిష సినిమా కోసం మరి అన్ని లొకేషన్స్..

  • IndiaGlitz, [Saturday,July 15 2017]

మూడు ప‌దులు వ‌య‌సు దాటినా, నేటి త‌రం హీరోయిన్స్‌తో ఢీ అంటే ఢీ అంటుంది చెన్నై సొగ‌స‌రి త్రిష. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష యాబై సినిమాల్లో న‌టించింది. ప‌దేళ్ళ‌కు పైగా వెండితెర‌పై క‌నువిందు చేసి సీనియ‌ర్ హీరోయిన్ అయ్యింది. ఇక త్రిష ప‌నై పోయింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చే కొత్త హీరోయిన్స్‌తో ఆమె పోటీ ప‌డ‌లేదు. అనుకునేవారికి ఆమె త‌న ప‌నితోనే స‌మాధానం చెబుతుంది.
ఒక వైపు హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో కూడా అభిమానుల‌ను అల‌రిస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆరేడు ప్రాజెక్టుల‌తో బిజీ హీరోయిన్ ఆప్ సౌత్ అయ్యింది. త‌మిళంలో 'మోహిని', '1818', '96', 'మే జూడే', 'సామి2', 'స‌తురంగ వేట్టై', 'గ‌ర్జ‌నై' చిత్రాల్లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం పిజ్జా ఫేమ్ విజ‌య్‌సేతుప‌తితో క‌లిసి '96' అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాను ఏకంగా 30 లోకేష‌న్స్‌లో చిత్రీక‌రించ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అల్రెడి రాజ‌స్థాన్‌, కొల్‌క‌త్తాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసింది. ట్రావెలింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌డంతో ఇన్ని లోకేష‌న్స్‌లో సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌నేది స‌మాచారం.

More News

హీరో ఫిక్సయ్యాడా..?

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ ఎంటర్ టైనర్ 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' - ప్రవీణ్ సత్తారు

అంకుశం,అగ్రహం,మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెర పై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో

'రా.రా...' లో మరో గీతం 'గల్లాటే గల్లాటే' విడుదల

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలోనే విడుదల కాబోతోంది.

ప్రేమిక ను చిన్న మూవీగా చూడకండి...

తనీష్, శృతి యుగళ్ జంటగా నటించిన మూవీ ప్రేమిక. ఈ మూవీని దేశాయ్ ఆర్ట్స్ పతాకంపై దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మాటలు, దర్శకత్వం మహేంద్ర. ఈ సినిమా టీజర్ ను ఫిల్మ్ చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.

నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సంబరాలు

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్రతి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్